శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతులకు రుణాలు మంజూరు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 23: జిల్లాలో ప్రకటించిన 15 మండలాల్లోని రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయించి తిరిగి రుణాలను మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబరులో వ్యవసాయశాఖ, కార్పొరేషన్ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరవు మండలాలైన సీతారామపురం, వరికుంటపాడు, కొండాపురం, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, చేజర్ల, అనంతసాగరం, రాపూరు, పొదలకూరు, గూడూరు, సైదాపురం, బాలాయపల్లి, ఓజిలి, కోట మండలాల్లోన రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను బ్యాంకర్లతో మాట్లాడి టర్మ్‌లోన్స్ మార్పు చేయించాలన్నారు. ఎల్ ఐసీ కార్డులు, సీ ఓసీలు ఎక్కువగా మంజూరు చేయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ కార్పొరేషన్లు 2015-16, 16-17, 17-18 సంవత్సరాలకు కేటాయించిన పథకాలు మంజూరు కాని లబ్దిదారులకు గ్రౌండింగ్ చేయుటకు మార్చి 2వతేదిన మెగా గ్రౌండింగ్ మేళాను నిర్వహించాలన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ల్యాండ్ పర్చేజింగ్ స్కీము లబ్దిదారుల ప్రతిపాదనలను జిల్లా సెలక్షన్ కమిటీకి పంపించాలన్నారు. అన్ని పథకాల గ్రౌండింగ్ మార్చి 15నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు కార్పొరేషన్‌లో ఎక్కువగా గ్రౌండింగ్ కావటం లేదని, బ్యాంకర్లు పథకాల అమలుకు రుణాలు మంజూరు చేయడం లేదని తాను పురపాలకశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. పథకాల గ్రౌండింగ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే ఈనెల 26న జరుగనున్న వీడియోకాన్ఫరెన్స్‌లో తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీ ఎం వెంకట్రావ్, వ్యవసాయశాఖ జేడి చంద్రనాయక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ఇడీలు రోజ్‌మాండ్, కమలకుమారి, వెంకటస్వామి, వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

తల్పగిరి రంగనాధస్వామి హుండీ లెక్కింపు
నెల్లూరు, ఫిబ్రవరి 23 ః తల్పగిరి రంగనాధస్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు శుక్రవారం లెక్కించారు. నాలుగు నెలల పదిరోజులకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. రూ.13,58,273 భక్తులు కానుకల రూపంలో హుండీలో వేశారు. గతంలోకన్నా ప్రస్తుతం రూ.6,18,333 కానుకలు భక్తులు చెల్లించినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ సుధాకర్‌రావు తెలిపారు. యూనియన్ బ్యాంక్‌లో నగదును జమ చేశారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ న్‌సెపక్టర్ చైతన్య, ధర్మకర్తల మండలి సభ్యులు వెంకటేష్, సి.మంగమ్మ, వెంకయ్యయాదవ్, కె.జగన్‌మోహన్‌రావు, జనార్ధన్‌రావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది.