శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఫిబ్రవరి 23: ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో తాకట్టుపెట్టారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఆంధ్రుల ఆత్మగౌరవ సమర శంఖారావం పూరించినట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం గూడూరు తహశీల్దార్ కార్యాలయం రహదారి మార్గంలో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిల్లకూరు బైపాస్ సెంటర్ నుంచి యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షను ప్రారంభించి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందని చెప్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఇన్నాళ్లు ఎందుకు ఈ విషయంలో వౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ, వైకాపా, ఇతర పార్టీల నాయకులు నాడు రాష్ట్ర విభజన సమయంలో రెండుకళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు తాను సమ్మతమని ప్రకటించారని తెలిపారు. నేడు మొసలి కన్నీరు కారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అన్నివిధాలా దివాలా తీసిన మఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాల్సిన కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ఇటీవల పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అర్థరహితమని అన్నారు. నాడు విభజన సమయంలో రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని చెప్పిన నాయకులు నేడు ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోయారని ఆయన ప్రశ్నించారు. నాడు విభజన సమయంలో ఒక్క సీపీఎం మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రకటించిందని, అనంతరం కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మొండిచేయి చూపించి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని అన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేరుతాయని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీని ఆదరించండి : పనబాక
కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ప్రజలను కోరారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం రాష్ట్రంలో తొలిసారిగా గూడూరు నుంచి ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రారంభించారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు చావోరేవో తేల్చుకుంటామని అన్నారు. ఇక్కడ ప్రారంభమైన ఆత్మగౌరవ దీక్ష ఢిల్లీ పీఠం కదిలే విధంగా ప్రజలు తమ వంతు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
గూడూరులో చేపట్టనున్న ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డికి చిల్లకూరు బైపాస్ సెంటర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి యువజన కాంగ్రెస్ నాయకులతో కలసి ఎన్ రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణం వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువజన కాంగ్రెస్ నాయకులు సవరపు కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో వందమందికి పైగా యువత ఈ బైక్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.