నెల్లూరు

అరకొర వసతులతో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియట్ పరీక్షలు గూడూరులో అరకొర వసతుల మధ్య బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పలువురు విద్యార్థులు అరకొర సౌకర్యాల నడుమ పరీక్షలు రాయవలసి వచ్చింది. ప్రధానంగా పలు పరీక్షా కేంద్రాలను రేకుల షెడ్లలో ఏర్పాటుచేయటంతో విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. తొలిరోజు పరీక్షా కేంద్రాలకు చేరుకోవటంలో విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. పలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఫ్యాన్లు, లైట్లు లేని గదుల్లో పరీక్షలను నిర్వహించారు. అలాగే మరికొన్ని కేంద్రాల్లో మంచినీరు, మరుగుదొడ్లు సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గూడూరు రెండవ పట్టణంలోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యార్థులు కూర్చుని పరీక్షలు రాసేందుకు ఏర్పాటుచేసిన బెంచీలు విరిగి ఉండటంతో విద్యార్థులు అవస్థల మధ్య పరీక్షలు రాసారు. ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లో పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉన్నా తొలిరోజు కావడంతో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి కాసింత అవస్థలు పడ్డారని చెప్పవచ్చు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పరీక్షలకు ముందుగానే విద్యార్థులు సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల్లో తమ హాల్‌టికెట్ ప్రకారం కేటాయించిన గదుల్లోకి వెళ్లేందుకు ఆతృతగా కనిపించారు. గూడూరులో తొలిరోజు జరిగిన ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులలో కొంత ఆందోళన కనిపించినా విద్యార్థులు మాత్రం పరీక్షలు ప్రశాంతంగా రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి గుంపులుగా ఉన్నవారిని చెదర గొట్టారు. గూడూరు పట్టణంలో ఇంటర్ పరీక్షల కోసం ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా, తొలిరోజు పరిక్షలకు 315మంది విద్యార్థులు హాజరు కావాలసి ఉండగా, 14మంది విద్యార్థులు గైరాజరయినట్లు పరీక్షల చీఫ్ సూపరింటిండెంట్ తెలిపారు.

ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం
* కాన్పు సమయంలో పసిబిడ్డకి కత్తిగాట్లు
* తొమ్మిది కుట్ల వేసిన వైనం
కావలి, ఫిబ్రవరి 28: కావలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రసవం కోసం వచ్చిన గర్భవతికి సిజేరియన్ చేసే సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భంలో ఉన్న పసిబిడ్డ తలపై కత్తిగాట్లు పడ్డాయి. ఇది గమనించిన డాక్టర్లు పసిబిడ్డ తలపై తొమ్మిదికుట్లు వేసి ఏమీకాదంటూ బిడ్డ తల్లిదండ్రులకు నచ్చజెప్పి చేతులు దులుపుకున్నారు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెం గ్రామానికి చెందిన తోట్లూరి శస్మిత కాన్పుకోసం బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు వచ్చింది. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో డాక్టర్ కోటేశ్వరరావు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను భయటకు తీశారు. కానీ ఆపరేషన్ జరుగుతుండగా బిడ్డ గర్భంలో ఉన్న సమయంలోనే ఆపరేషన్ కత్తి తగిలింది. ఈ కారణంగా బిడ్డ తలకు ఏర్పడిన గాయానికి తొమ్మిది కుట్లు వేసి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఈ విషయమై డాక్టర్ కోటేశ్వరరావు వివరణ కోరగా సీజేరియన్ కోసం తల్లికి గాటుపెట్టిన సమయంలో రక్తస్త్రావం ఎక్కువగా ఉన్నందున లోపల ఉన్న బిడ్డకు కత్తి తగిలిన విషయం కనిపించలేదని చెప్పారు.