నెల్లూరు

ఎగుమతి, దిగుమతుల్లో కృష్ణపట్నం పోర్టు సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, ఫిబ్రవరి 28: కార్గో ఎగుమతి, దిగుమతుల్లో కృష్ణపట్నం పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈనెల 27వ తేదీన 24 గంటల్లో 201934 మెట్రిక్ టన్నులు ఎగుమతులు, దిగుమతులు చేసి ఒకేరోజులో సరికొత్త రికార్డు నమోదుచేసింది. గత సంవత్సరం మార్చి 25వ తేదీన 24 గంటల్లో 190232 మెట్రిక్ టన్నులు ఎగుమతులు, దిగుమతులు చేయగా, దానిని అధిగమించి 2 లక్షలకు పైగా కార్గోను హ్యాండిల్ చేసి అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించిందని ఓడరేవు అధికారులు పేర్కొన్నారు. పోర్టు ఎగుమతులు, దిగుమతుల్లో అత్యాధునిక యంత్రాలు కలిగివుండడంతో పాటు అవసరమైన అన్ని వసతులను కృష్ణపట్నం పోర్టు కలిగి వుందని ఓడరేవు ఉన్నతాధికారులు తెలిపారు.

హోదా కోసం తొలి అడుగు
* నేడు కలెక్టరేట్ ఎదుట వైకాపా భారీ ధర్నా
నెల్లూరు, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు సిద్ధమై ప్రణాళికాబద్ధంగా పోరాడాలని నిర్ణయించుకొని తొలి అడుగుగా గురువారం కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం కార్యాచరణ పోరాటానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. దశలవారీ పోరాటంలో తొలి అడుగు గురువారం చేపట్టబోయే ఆందోళన కార్యక్రమంతో శ్రీకారం చుట్టబోతున్నారు. విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే పూర్వవైభవం వస్తుందని తాము ఆది నుండి వాదిస్తున్నామని, కేవలం అధికారంలోని టీడీపీ ప్రభుత్వమే హోదా సంజీవని కాదని, ప్యాకేజీ చాలంటూ బేరసారాలకు దిగడం విచారకరమని జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలో సంకల్పయాత్ర కొనసాగుతున్న సమయంలో ఇక్కడ నుంచే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడంతో అధికార టీడీపీ ఆత్మరక్షణలో పడింది. తర్వాత జగన్ నిర్ణయంపై టీడీపీ నేతలు ఎంత విమర్శించినా, పెదవి విరిచినా ప్రజల్లో మాత్రం ఆయన నిర్ణయం పట్ల ఒకింత సానుకూలత వ్యక్తమైనట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ధర్నా అనంతరం పార్టీకి చెందిన ఎంపీలు పార్లమంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో పార్లమెంటు ఎదుట ఈనెల 5న నిరసన చేపట్టబోతున్నారు. చివరి అస్త్రంగా సమావేశాల చివరిరోజు పార్టీ ఎంపీలందరూ తమ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తారని పార్టీ నేత జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో అందులో భాగంగానే తమ నేత ఇచ్చిన పిలుపుతో పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్పందించారని జిల్లా వైకాపా నేతలు చెబుతున్నారు. ధర్నా విజయవంతం చేసేందుకు మంగళవారం పార్టీ రీజనల్ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, పార్టీ జిల్లా సీనియర్ నేతలు పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణుల్ని కార్యక్రమానికి సిద్ధం చేస్తూ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమానికి దిగ్విజయం చేయడం ద్వారా కార్యాచరణకు జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన నేలపై తొలి పోరాటాన్ని విజయవంతం చేయాలనే తలంపుతో వైకాపా నేతలు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాల నుండి వైకాపా కార్యకర్తలు, సానుభూతిపరులతో పాటు ప్రత్యేకహోదా కోసం ముందుకు వచ్చేవారందరిని సమీకరించే పనిలో ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటంతో పాటు జిల్లాలో పార్టీ పటిష్ట స్థితిలో ఉందనే సంకేతాలు పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడేలా చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.