నెల్లూరు

15న కార్మిక సంఘాల మానవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, మార్చి 12: రక్షణ రంగ ప్రైవేటీకరణ, కేంద్ర కార్మిక చట్టాలలో సవరణలకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం మోహన్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 15న తలపెట్టిన కార్మికుల మానవహారం నిర్వహణపై వివిధ కార్మిక సంఘాలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలలో సవరణలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఇలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. ఇప్పటికే అనేక రంగాలను ప్రైవేటీకరించిన ప్రభుత్వాలు దేశ భద్రతకు సంబంధించిన రక్షణ రంగాన్ని సైతం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటన్నారు. అలాగే బొగ్గు, రవాణ రంగాల కార్మికుల సమస్యలు, వివిధ పథకాల కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులందరూ సమైక్యం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇటీవల ప్రకటించిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. కార్మికుల ఐక్య ఉద్యమాలు నిర్మించటంతో పాటు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా చేపట్టిన ఈ మానవహారంలో పెద్దసంఖ్యలో కార్మికుల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, ఐద్వా సంఘాల ప్రతినిధులు కత్తి శ్రీనివాసులు, కె ఆంజనేయులు, దామా అంకయ్య, కె శివాచారి, ఎస్‌కె రహెనాబేగం, డి అన్నపూర్ణమ్మ, లీలామోహన్, జి నాగేశ్వరరావు, అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

కావలి ఏరియా వైద్యశాల తనిఖీ
కావలి టౌన్, మార్చి 12: పేదలకు మెరుగైన వైద్యం అందించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 70 మార్కులు వచ్చిన వైద్యశాలకు కేంద్రం నుంచి కొంత నజరాన అందజేస్తోంది. ఈనేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలోని పలు అభివృద్ధి పనులపై కేంద్రం నుంచి వచ్చిన ఢిల్లీకి చెందిన డాక్టర్ ప్రణీత్‌కుమార్, గోవాకు చెందిన డాక్టర్ శే్వత, బెంగుళూరుకు చెందిన డాక్టర్ రుక్మిణి సోమవారం ఏరియా వైద్యశాలను తనిఖీ చేశారు. అనంతరం వైద్యశాలలో శానిటేషన్, పలు వార్డులను పరిశీలించారు. ఈ బృందం వరుసగా మూడురోజులు వైద్యశాలలో వసతులపై పరిశీలించి మార్కులు వేస్తారని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు తెలిపారు.

ఎన్‌బికెఆర్‌లో జాతీయ సాంకేతిక సదస్సు
కోట, మార్చి 12: కోట మండలం విద్యానగర్‌లోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం కోలోక్వియా 2కె18 జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును కళాశాల డైరెక్టర్ వి విజయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. సదస్సుకు తిరుపతికి చెందిన శ్రీనివాసన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థ ప్రతినిధి ఆర్ మణివణ్ణన్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు విద్యార్థుల అభ్యున్నతికి, వారిలోని సృజనాత్మకతకు దోహదపడతాయన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో అనే అంశంపై మెలకువలు నేర్పించారు. ఈ సదస్సుకు వివిధ కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొనగా వారికి వివిధ రకాల ప్రాజెక్టులపై పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి కిషంధర్, వివిధ విభాగాధిపతులు ఎ రాజశేఖర్‌రెడ్డి, వెంకట్రావ్, మల్లికార్జునరెడ్డి, రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్, ప్రమోద్‌కుమార్ శర్మ, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.