నెల్లూరు

టీడీపీ నేతల తీరు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, మార్చి 12 : తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే తీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని జిల్లా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు పదవుల కోసం చంద్రబాబునాయుడు దగ్గర ప్రవర్తిస్తున్న విధానం కామెడీ ఆర్టిస్టుల్లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేకించి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరు చాలా బాధాకరంగా వుందని, ఆయన అసెంబ్లీ సీటు కోసం ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాల్లో 75 శాతం బీజేపీ ఇప్పటికే పూర్తిచేసిందన్నారు. టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. టీడీపీ నాయకులే నేడు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు బయటపెడతానన్నారు. కేంద్రం నిధులిచ్చినా ఇప్పటికీ అమరావతిలో పనులు పూర్తిచెయ్యలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని ఏర్పాటుచేస్తామని ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇకనైనా టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పెదరోశయ్య, నరసింహులునాయుడు, బుజ్జిరెడ్డి, కాయల మధు, గిరికుమార్‌గౌడ్, శ్రీనివాసులు, సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
12వేణు 3 : విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి

కసాయి తండ్రి
చిన్నారిని చిదిమేశాడు
అల్లూరు, మార్చి 12: కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి కన్నకూతురు అన్న కనికరం లేకుండా చిన్నారిని చిదిమేశాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని ఇందుపూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అల్లూరు మండలం నార్తుఆములూరు గిరిజన కాలనీకి చెందిన కిరంశెట్టి చంద్ర, సంజీవినికి కలిగిన సంతానం చందన (3). వీరు మండలంలోని ఇందుపూరు గ్రామంలో పశువుల కాపరులుగా ఉండేవారు. నిత్యం భార్యాభర్తలు గొడవ పడుతుండేవారని, ఈక్రమంలో భర్త ఘర్షణకు దిగడంతో భార్య అలిగి ఆమె స్వగ్రామమైన నార్తు ఆములూరికి వెళ్లిపోయింది. దీంతో అతడు చిన్నారి చందనకు గుళికలు తినిపించగా ఆమె చనిపోయింది. ఈ పరిస్థితుల్లో అతడు కూడా గుళికలు తిని అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో స్థానికులు అతడిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు.

అవినీతిని అరికట్టాలంటూ సీపీఐ ధర్నా
వేదాయపాళెం, మార్చి 12: మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాలలో అవినీతి జరుగుతోందని, అధికారులు స్పందించి అవినీతిని అరికట్టాలని కోరుతూ సీపీఐ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు రామరాజు మాట్లాడుతూ టీపీ గూడూరు మండలం పోట్లపూడి గ్రామంలో మరుగుదొడ్లు, పక్కా ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. ఆ గ్రామంలో 430కి పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, అయితే వాటిని సక్రమంగా నిర్మించలేదన్నారు. మరుగుదొడ్లు నిర్మించకున్న వారికి బిల్లులు ఇవ్వలేదన్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.30వేలు లంచం అడుగుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు కోరారు.