శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతు సంక్షేమమే టీడీపీ లక్ష్యం: మంత్రి సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, మే 22: రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అమ్మవారిపాలెం మీదుగా వెళ్తున్న సోమశిల దక్షిణ కాలువను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ కాలువకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సోమశిల దక్షిణ కాలువ ఈ ప్రాంత రైతుల 35ఏళ్ల కలని, వీరి కలను తాను నెరవేర్చినట్లు తెలిపారు. అటవీ అనుమతులు రాని కారణంగా తిరుపతినాయుడుపల్లి వంక వద్ద కాలువ నిర్మాణం ఆగిపోయిందని, 50లక్షల వ్యయంతో సైఫన్‌ను నిర్మించి కనుపర్తి, ఆల్తుర్తి, నావూరుపల్లి చెరువులకు సుమారు మూడువేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. మిగిలిన పనులను ఈ సీజన్‌లో పూర్తిచేసి అమ్మవారిపాలెం, ప్రభగిరిపట్నం, బత్తులపల్లి, నేదురుపల్లి గ్రామాల్లో మరో నాలుగువేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గత పాలకులు ఈ మండలాన్ని మెట్టప్రాంతంగా ఉంచాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈ ప్రాంతాన్ని డెల్టాగా మార్చే అదృష్టం తనకు దక్కిందన్నారు. కండలేరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో రెండు రోజులు నీరుకావాలని రైతులు అడుగుతున్నారని, త్వరలో నీటిని విడుదల చేయిస్తామన్నారు. పొదలకూరు మండలంలో నీటిఎద్దడిని పూర్తిగా తొలగించేందుకు శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తిచేశామని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొదలకూరు మాజీ జడ్పీటీసీ దేవరం అనురాధ, మండల టీడీపీ నాయకులు దేవరం విజయమ్మ, పీవీ రత్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.