శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చిప్పలేరు బ్రిడ్జీ నిర్మాణంతో నెరవేరనున్న కావలి, అల్లూరు మత్స్యకారుల కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి రూరల్, మే 22: మండల పరిధిలోని అన్నగారిపాళెం పంచాయతీ వెంకటేశ్వరపాళెం గ్రామ సమీపంలోని చిప్పలేరు వాగుపై చేపట్టిన బ్రిడ్జీ నిర్మాణంతో కావలి, అల్లూరు మండలాల మత్స్యకారుల చిరకాలపు కల నెరవేరనుంది. కొనే్నళ్లుగా ఈ మండలాల ప్రజలు ప్రధానంగా సముద్రతీర ప్రాంతాలలో నివాసాలు ఉంటూ చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. ఈ మండలాల మత్స్యకారులు రాకపోకలు సాగించాలంటే వ్యయప్రయాసలు తప్పటం లేదు. చిప్పలేరు దాటేందుకు సముద్రపు ఒడ్డుకు చేరుకునేందుకు బోటు సహాయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేటలో లభించిన చేపలను మార్కెట్‌కు తరలించేందుకు బోటు సహాయం తప్పనిసరిగా మారింది. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగు, చేపలకు మార్కెట్ సదుపాయ కల్పనలో భాగంగా బీద సోదరులు ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి బ్రిడ్జీ నిర్మాణం చేపట్టింది. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి 18కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ బ్రిడ్జీ నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జీ నిర్మాణం పూర్తయితే ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై విజయవాడ నుంచి చెన్నైకు వెళ్లేందుకు సుమారు 15కిలో మీటర్ల దూరం తగ్గి అనువైన రవాణ సదుపాయం ఏర్పడుంతుంది. 13.10కిలో మీటర్ల మేరకు నిర్మించే రహదారితో కావలి, అల్లూరు మండలాల పరిధిలోని జువ్వలదినె్న, అన్నగారిపాళెం, వెంకటేశ్వరపాళెం, తుమ్మలపెంట, కొత్తసత్రం, పెద్దనట్టు, ఎస్వీపాళెం తదితర 30గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడి ప్రజలు రాకపోకలు సాగించేందుకు దోహదపడుతుంది. బ్రిడ్జీ నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు పలు పర్యాయాలు వివిధ రాజకీయ పక్షాలకు మొరపెట్టుకున్నా అలసత్వం వహించాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు బ్రిడ్జీ నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరేందుకు మార్గం సుగమం అయింది. కాగా ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా బ్రిడ్జీ నిర్మాణం పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు గడువు విధించగా, నిర్ణీత సమయానికి నిర్మాణం పూర్తవకపోవడంతో మరికొంత గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నాణ్యత ప్రమాణాలు లోపించి ఇప్పుడే బ్రిడ్జీలో కొంతభాగం బీటలు బారటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బ్రిడ్జీ నిర్మాణానికి అవసరమైన పైభాగం నమూనాలు నాసిక్ నుంచి ముడిసరుకు సరఫరా చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నామని సమాధానం ఇస్తున్నారు. 10కాలాల పాటు ఉండాల్సిన చిప్పలేరు బ్రిడ్జీ నిర్మాణం పనులు పూర్తవకముందే బీటలు బారటంతో వాహనాల రాకపోకలకు ఏమేరకు ఉపయోగపడుతుందోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.