శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, మే 22: ఆపదలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుందనే ఉద్ధేశ్యంతో కేంద్రంలో నాలుగేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినా, కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోకపోగా వివక్ష చూపుతోందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవటంతోపాటు ప్రత్యేక ప్యాకేజీ అని ఇటీవల వరకు మభ్యపెట్టి చివరకు నిధులు కూడ కేటాయించలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం నంచి, ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చామని తెలిపారు. కావలి పట్టణంలో మంగళవారం జరిగిన మినీ మహానాడులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచితంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఇప్పటికీ ప్రజలకు సక్రమంగా నగదు లభించటం లేదని, కానీ ఇటీవల ఎన్నికలు జరిగిన కర్నాటకలో మాత్రం బీజేపీ నాయకులకు విచ్చలవిడిగా నగదు అందుబాటులో ఉంచారని ఆరోపించారు. జీఎస్టీ ప్రభావంతో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ధరలు పతనం అవుతున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పంట దిగుబడులలో 90శాతం వరకు సేకరిస్తున్న కేంద్రం బీజేపేయేతర రాష్ట్రాలలో కనీసం 30శాతం పంటను కూడా కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. రైతులు నష్టపోకూడదనే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పంటలు సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పంటదిగుబడులలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అటవీశాఖ అనుమతులు సాధించి సోమశిల రిజర్వాయర్‌లో 78 టీఎంసీల పూర్తిస్థాయి నీటిని నిల్వ చేస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు రెండులక్షల ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములు ఉండగా నెల్లూరు జిల్లాలోనే 99600ల ఎకరాలు ఉన్నాయన్నారు. 1975వ సంవత్సరంలో ఏర్పడిన సీజేఎఫ్‌ఎస్ వ్యవస్థను రద్ధు చేసి లబ్ధిదారులకు భూమిపట్టాలు అందజేస్తామన్నారు. దీనివల్ల లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు పొందేందుకు వీలవుతుందని తెలిపారు.
సేవకుడిని గెలిపించుకోండి
నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు సాధించుకుంటూ ప్రజావసర కార్యక్రమాలను పూర్తిచేస్తున్న నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావును గెలిపించుకోవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికలలో ద్వితీయశ్రేణి నాయకుల అలసత్వం కారణంగా ఓడిపోయినప్పటికీ బీద సోదరులు నిరుత్సాహపడకుండా కావలి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయించుకుంటూ అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు తమ ట్రస్టు ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతూ సొంత నిధులను ఖర్చుచేస్తున్న నిజాయితీపరుడైన మస్తాన్‌రావును రానున్న ఎన్నికలలో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.