నెల్లూరు

పసిబిడ్డ అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 22: స్థానిక బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన సంచారజాతి జంటకు చెందిన పసిబిడ్డను గుర్తుతెలియని మహిళ మంగళవారం అపహరించింది. పోలీసుల కథనం మేరకు స్థానిక బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ శ్రీనివాసులు, గంగ దంపతులు సోమవారం రాత్రి తమ బిడ్డతోపాటు నిద్రకు ఉపక్రమించారు. అయితే గత కొద్దిరోజులుగా తమతోపాటు కలిసి ఉన్న ఓ గుర్తుతెలియని మహిళ మంగళవారం ఉదయం పది రోజుల పసికందును అపహరించుకొని వెళ్లినట్లు మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిద్ర లేచేసరికే తమ బిడ్డ తమ వద్ద లేకపోవడంతో చుట్టుపక్కల గాలించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడో నగర సిఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.