శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వాకాడు పీఏసీఎస్ సీఈవో సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకాడు, జూలై 19: వాకాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మునికృష్ణయ్యను సస్పెండ్ చేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ కొడవలూరు దామోదర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పీఏసీఎస్‌లో కోటి రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్లు తాను గుర్తించి విచారణ జరపాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసానని, సుదీర్ఘ విచారణ అనంతరం రూ.18లక్షలు సీఈవో స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. నిధులు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలటంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించడంతో సస్పెండ్ చేసినట్లు చైర్మన్ తెలిపారు. పదవీ విరమణ చేసిన బ్యాంకు మెనేజర్ జయరామయ్య, సీఈవోలు రాంమ్మూర్తి, కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, అసిస్టెంట్ మెనేజర్ విజయరత్నంపై విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం వారిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న రుణమాఫీలో వాకాడు పీఏసీఎస్‌కు ఏ ఒక్క లబ్ధిదారుడు రాకపోవడంతో పీఏసీఎస్‌లోని రుణగ్రహీతల పేర్లను పరిశీలించగా వారు దాదాపు ఈప్రాంతం వారు కాకపోవడంతో అనుమానంతో విచారణకు ఆదేశించామన్నారు. ఈ విచారణలో సిబ్బంది చేతివాటం బహిరంగమయిందని, సీఈవో మునికృష్ణయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలిందన్నారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన సీఈవో మునికృష్ణయ్య ఈ పీఏసీఎస్‌లో కలెక్షన్ ఏజెంటుగా విధుల్లో చేరి సీఈవో స్థాయికి ఎదిగారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే ఎవరెవరు ఎంత మొత్తంలో నిధులు స్వాహా చేశారనేది బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

గ్రామ దర్శినిలో కానరాని ఐక్యతరాగం
సూళ్లూరుపేట, జూలై 19: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీలో ఐక్యత కొరవడింది. రెండు రోజులుగా మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య గ్రామాల్లో పాల్గొన్న గ్రామదర్శినిలో పలువురు నాయకులు డుమ్మాకొట్టారు. అంతేకాదు ఏకంగా పరసాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు పరసా ఎవరు, పార్టీ తరపున ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడంటూ ఆయన ముందే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం తీరప్రాంత గ్రామాలైన కడపట్ర, దామరాయి, కొరిడి పంచాయతీల్లో జరిగిన గ్రామదర్శినిలో పరసా పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. పరసా పర్యటనకు పలువురు సీనియర్ నాయకులు హాజరుకాలేదు. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పరసా పర్యటనలో నాయకులు తప్ప ప్రజలెవరు పాల్గొనకపోవడం అధికార పార్టీకి ఎంతమాత్రం బలం ఉందో ఇట్టే అర్థమవుతుందని పలువురు అంటున్నారు. అదేవిధంగా బుధవారం తడ మండలంలో జరిగిన కార్యక్రమంలో వేనాటి రామచంద్రారెడ్డి వర్గం పాల్గొనలేదు. ఎన్నికల ఏడాది అధికార పార్టీలతో గ్రూపుల పోరు తారస్థాయికి చేరడంతో గెలుపు కష్టతరమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పరసాపై ఉన్న వ్యతిరేకత పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలే పరిస్థితి స్పష్టంగా కన్పిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, మాజీ సర్పంచి గొంజి వెంకటేశ్వర్లు, పాకం వెంకటసుబ్బయ్య, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.