శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సీజేఎస్‌ఎఫ్ పట్టాల స్థానంలో డీకేటీ పట్టాలు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, జూలై 19: నెల్లూరు డివిజన్ పరిధిలోని 205 భూమి కో-అపరేటివ్ సొసైటీలకు సంబంధించి సుమారు 30వేల మందికి ఇచ్చిన సీజేఎస్‌ఎఫ్ పట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో డీకేటీ పట్టాలను ఇస్తామని నెల్లూరు ఆర్డీవో హరిత తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సీజేఎస్‌ఎఫ్ లబ్ధిదారులతో సీజేఎస్‌ఎఫ్ మండల కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ గతంలో సీజేఎస్‌ఎఫ్ పట్టాలను మంజూరుచేసే సమయంలో కో-అపరేటివ్ సొసైటీల పేరుతో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ నిర్వహించి సొసైటీ సభ్యులకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం సొసైటిలను రద్దు చేసిన తరువాత డీకేటీ పట్టాలను అందచేస్తామన్నారు. దీనికోసం లబ్ధిదారుల సమ్మతి తీసుకోవడానికి సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజేఎస్‌ఎఫ్ పట్టాలతో లబ్ధిదారుల పేర్లకు బదులు అడంగల్‌లో ఆర్డీవో పేరు ఉండటంతో ప్రభుత్వం అందించే పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని, దీంతోపాటు రైతులకు బ్యాంకర్లు రుణాలు మంజూరుచేసే అవకాశం లేకపోవడంతో సీజేఎస్‌ఎఫ్ పట్టాలను రద్దుచేసి వాటి స్ధానంలో డీకేటీ పట్టాలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొదట సొసైటీలను రద్దు చేసిన తరువాతే డీకేటీ పట్టాలను ఇవ్వడానికి అవకాశం ఉందని, ఇప్పటి వరకు నెల్లూరు డివిజన్ పరిధిలోని రాపూరు, పొదలకూరు మండలాలు మినహా అన్ని మండలాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి పట్టాలను రద్దు చేసామన్నారు. గతంలో సీజేఎస్‌ఎఫ్ పట్టాలను పొందిన లబ్ధిదారులు వాటిని మరొకరికి అమ్మి ఉంటే ఆ భూములపై పట్టాలు అమ్మకందారుడి పేరిట ఇవ్వాలా, లేక కొనుగోలు దారుల పేరిట ఇవ్వాలా అనే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే సీజేఎస్‌ఎఫ్ భూములకు సంబంధించి ఎంజాయ్‌మెంటు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మనుబోలు మండలంలో 13సొసైటీల పరిధిలో 1512మంది లబ్ధిదారులు ఉన్నారని, వారి సమ్మతితో సొసైటీలను రద్దు చేసి వాటి స్థానంలో డీకేటీ పట్టాలను వచ్చే రెండునెలల్లో అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లీలారాణి, ఎంపీడీవో శ్రీనువాసులురెడ్డి, నెల్లూరు కో-అపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగవేణి, ఈఓపీఆర్‌డీ శేఖర్, ఇరిగేషన్ ఏఈ ఠాగూర్ ఉన్నారు.