శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కావేరిగుంట గిరిజన కాలనీని దత్తత తీసుకున్న బీద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి టౌన్, జూలై 19 : పట్టణ పరిధిలోని 6వ వార్డు కావేరిగుంట గిరిజన కాలనీని గురువారం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కాలనీలో ఎటువంటి వౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం గ్రామానికి దారిలేక అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అలాగే ఇళ్లు లేక ఒక పూరి గుడిసెలోనే రెండు మూడు కుటుంబాలు జీవిస్తున్నామని, రేషన్‌కార్డులు తదితర సమస్యలపై కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ ఈ రోజు నుంచి కాలనీని దత్తత తీసుకుంటున్నామని, త్వరలో ఈ ప్రాంతంలోని 43 కుటుంబాలు జీవిస్తున్నాయని, అందరికీ లేఅవుట్ వేయించి తన సొంత నిధులతో బేస్‌మెంట్లు వేయించి ఆరు నెలల్లో కాలనీనీ అభివృద్ధి చేస్తామన్నారు. ఇకనుంచి మీ కాలనీకి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. బడి ఈడు పిల్లలందరినీ బడికి పంపాలని, మీకు చదివించే స్థోమత లేనందున ఒక్క రూపాయి ఖర్చులేకుండా గురుకులంలో చేర్పించి చదివిస్తామని హామీ ఇచ్చారు. కాలనీకి రోడ్డు విషయమై అధికారులతో మాట్లాడామని, త్వరలో కాలనీకి దారి ఏర్పాటు చేసి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధి పథకాలపై వారికి అవగాహన కల్పించి ప్రతి విషయంలోను మీకు అండగా ఉంటానని తెలిపారు. ఈ రోజు పనికి వెళ్లకుండా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి రూ.200 చొప్పున నగదు అందజేసి సినిమాకి వెళ్లాలని సూచించడంతో కాలనీ వాసులు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ పోతుగంటి అలేఖ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నుడా డైరెక్టర్ పాలడుగు రంగారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అమర యాదగిరిగుప్తా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు బ్రహ్యయ్య, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు దేవకుమార్, పలువురు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
గూడూరు, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టిన అన్న క్యాంటీన్లు గూడూరు పట్టణంలో త్వరలో ఏర్పాటు కానున్నాయి. దీంతో కేవలం పూటకు రూ.5కే భోజనం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో గురువారం గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పొనకా దేవసేన పట్టణంలో అనువైన స్థలం కోసం అధికారులతో కలిసి పాతబస్టాండు, పంచాయతీరాజ్ అతిథి భవనం ముందు వైపు ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈ తరుణంలో ఆమె పర్యవేక్షణలో టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆయా స్థలాలకు కొలతలు తీశారు. పాత బస్టాండు ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే దిశగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దేవసేన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో త్వరలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు మూడు పూటల కేవలం రూ.15కే భోజనం అందించి ఆకలి తీర్చడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, టౌన్‌ప్లానింగ్ అధికారులు మునిలక్ష్మి, సతీష్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.