శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేటి నుంచి లారీల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జూలై 19: అఖిల భారత మోటారు వర్కర్ల సంఘం జాతీయ సమ్మెకు పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లాలో యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం నుండి లక్షలాది లారీలు ఆగిపోనున్నాయి. లారీల బంద్ కారణంగా సరుకుల రవాణాపై తీవ్రప్రభావం చూపనుంది. బంద్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయింది. అత్యవసర సరుకులు మినహా మిగిలిన సరుకులు రవాణా చేయడం కష్టమని లారీ యూనియన్ నాయకులు అంటున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లలో అనేక సమస్యలపై సమ్మె జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అఖిల భారత మోటార్ వర్కర్ల సంఘం డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించాలని, మూడు నెలలకు ఒకసారి దానిని సవరించాలని, లారీ యజమానుల నుంచి ట్రాన్స్‌పోర్టు డెవలప్‌మెంట్ చార్జీల వసూళ్లను రద్దు చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రమాదాలు, ఓవర్‌లోడు కేసులలో డ్రైవర్ల లైసెన్సు రద్దు విధానాన్ని విరమించాలన్నారు. అలాగే లారీలపై ఓవర్‌లోడు నిషేధించాలని, జీఎస్టీ, ఈ-వేబిల్లు సమస్యలు పరిష్కరించాలని, పర్యాటక వాహనాలకు పెండింగులో ఉన్న జాతీయ అనుమతులు జారీచేయాలని, ఆర్టీవో, పోలీసు, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని, జాతీయ పర్మిట్లు ఉన్న సరుకు రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధన రద్దు చేయాలని డిమాండు చేస్తు మోటారు వాహనాల వర్కర్ల సంఘం ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ కారణంగా అత్యవసర వస్తువులు మినహా మిగతా అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలను నిలిపివేస్తామని లారీ సంఘాల నాయకులు తెలిపారు. బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు 50వేల వరకు లారీలు, మినీ వ్యాన్లు, టిప్పర్లు ఎక్కడికక్కడ నిలిపి వేస్తామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమై అత్యవసర సేవలకు ఆటంకాలు కలగకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సమ్మెను రాష్టవ్య్రాప్తంగా విజయవంతం చేయాలని నాయకులు వాహన చోదకులకు పిలుపునిచ్చారు. పాలు, నీరు, ఔషధాల రవాణాకు మినహాయింపు ఇచ్చామని, కానీ నిత్యావసరాలైన కూరగాయలు, రోజువారీ సరుకుల రవాణా నిలిపివేస్తామని జిల్లా లారీయూనియన్ సంఘ నాయకులు తెలిపారు. లారీల సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపనుంది.