శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హైస్కూల్‌లో టీటీసీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింజమూరు, సెప్టెంబర్ 12 : టీచర్ ట్రైనింగ్ చేసే విద్యార్థులకు పరీక్షల కారణంగానే వింజమూరు హైస్కూల్ విద్యార్థులు చెట్ల కింద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వింజమూరు పట్టణంలో రెండు, కావలి సమీపంలో ఒకటి టీటీసీ కళాశాల విద్యార్థులు పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదే పట్టణంలో అనేక గుర్తింపు పొందిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉండగా 1000 మంది విద్యార్థులు చదువుతున్న ఉన్నత పాఠశాలకు పరీక్ష కేంద్రంగా అనుమతులు ఇవ్వడంతో తరగతుల నిర్వహణకు ఒక పూట అంతరాయం ఏర్పడుతున్నది. అంతేకాకుండా విద్యార్థులకు చెట్ల కింద తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారిని ఫోన్ ద్వారా వివరణ కోరగా ఒక పూట పాఠశాల నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలగడం లేదని తెలిపారు. అలా అంతరాయం కలిగితే మరో పర్యాయం కేంద్రాన్ని మారుస్తామని తెలిపారు.

జిల్లా ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు
వేదాయపాళెం, సెప్టెంబర్ 12: వినాయకచవితిని పురస్కరించుకుని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కె వెట్రిసెల్వి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిలు జిల్లా ప్రజలకు వేర్వేరు ప్రకటనల్లో వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.