శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మేజర్ పోర్టు కోసం మళ్లీ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, సెప్టెంబర్ 12: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించనున్న నాన్‌మేజర్ పోర్టుకు వ్యతిరేకంగా మేజర్ పోర్టు కోసం మళ్లీ ఉద్యమాలబాట పడుతామని మాజీ ఎమ్మెల్యే, పోర్టు సాధన సమితి కన్వీనర్ వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 28 రద్దుకోరుతూ ఒంగోలులో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో సైతం పర్యటించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబర్ 28లో దుగ్గరాజపట్నం ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టారు. కేంద్రం కోరిన విధంగా దుగ్గరాజపట్నానికి ప్రత్యామ్నాయంగా రామాయపట్నంను సూచించకపోవడానికిగల కారణాలను తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.25వేల కోట్ల పెట్టుబడితో భారీ ఓడరేవు, షిప్ యార్డులను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న తరుణంలో రామాయపట్నం వద్ద నాన్‌మేజర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు రామాయపట్నం పోర్టు వద్ద నాన్‌మేజర్ పోర్టును నిర్మిస్తే మేజర్ పోర్టు నిర్మాణ అవకాశాలను పూర్తిగా కోల్పోతామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అవకాశాలను సైతం కాలరాస్తూ చంద్రబాబు తీసుకున్న నాన్‌మేజర్ పోర్టు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలతో పాటు ముఖ్యంగా యువత కూడా ఉద్యమ బాట పట్టాలని ఆయన తన ప్రకటనలో కోరారు.