శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జయజయ శుభకర వినాయక...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 12: ‘వక్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా
సర్వ కార్యేషు సర్వదా!
ఏ కోవెల కెళ్లినా, ఎక్కడ ఎటువంటి యజ్ఞాలు, వ్రతాలు, యాగాలు చేపట్టినా తొలి పూజాపునస్కారాలు అందుకునే విఘ్నేశ్వరుడి వేడుకలకు జిల్లాలోని అన్ని ప్రాంతాలు ముస్తాబయ్యాయి. గురువారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకునేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. జిల్లాలోని విఘ్నేశ్వరాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగైన వినాయకచవితి సంబరాలు బుధవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. నెల్లూరుతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలన్నింటిలోనూ పండగ కొనుగోళ్ల సందడి నెలకొంది. చిన్నచిన్న మట్టి విగ్రహాల మొదలు భారీ వినాయక ప్రతిమల కొనుగోళ్లతో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు, మద్రాస్ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడాయి. ప్రతిమలతో పాటు వినాయకుని పూజకు ఉపయోగించే అరటి పిలకలు, దర్బలు, మామిడి ఆకులు, యలక్కాయలు తదితర వస్తు సామగ్రిని తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతూ కనిపించారు. పలు చోట్ల ప్రతిమల ఏర్పాటు
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు. నగరంలోని వేదాయపాలెం, కాపువీధి, శివాజీ సెంటర్, పెద్దబజార్, చిన్నబజార్, స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, పొగతోట, బీవీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రతిమలను ఏర్పాటు చేసేందుకు మండపాలు నిర్మించి, అందంగా సినిమా సెట్లు తలపించేలా ఏర్పాట్లు చేయడం విశేషం. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో మండపాలు నిర్మించి విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఆఫర్ల సందడి
వినాయక చవితిని పురస్కరించుకొని నగరంలోని పలు షాపింగ్‌మాళ్లు, ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ దుకాణాలు ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. దుకాణాలను అందంగా విద్యుద్దీపాలతో అలంకరించి వినియోగదారులకు ప్రతి కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు అందచేస్తుండటంతో కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. అలాగే వస్త్ర దుకాణాలు బుధవారం కిటకిటలాడాయి. వినాయకచవితి సందర్భంగా ప్రతిమలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పోలీసు శాఖ తెలిపింది.