శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చెంగాళమ్మ ఆలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 21 : తెలుగు, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులచే అమ్మవారి బలిపీఠం, చెట్టు తదితర వాటికి శుద్ధి పూజ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన హోమగుండాల్లో యజ్ఞాలు ఘనంగా నిర్వహించారు. చెంగాళమ్మ ఆలయంలో తొలిసారిగా పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు పాలకవర్గం వారు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల ప్రారంభానికి ముందు ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేసేందుకు హోమద్రవ్యాలు సమర్పించారు. అమ్మణ్ణి ముందు హోమద్రవ్యాలతో పాటు పుష్పాలు పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవిత్రోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి వేదపండితులు పవిత్రోత్సవ శుద్ధిపూజలు ఘనంగా చేశారు. ఆదివారం వరకు మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ముప్పాళ్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండటలి సభ్యులు పులుగు శ్రీనివాసులురెడ్డి, ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.