శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భక్తులతో పొటెత్తిన కసుమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, సెప్టెంబర్ 21: నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరైన భక్తులు వెంకటాచలం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌వలీ దర్గాకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భారీగా వచ్చిన భక్తులతో కసుమూరు గ్రామం శుక్రవారం సందడిగా మారింది. భక్తులు మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్ర నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వెంకటాచలం నుండి కసుమూరు వరకు రోడ్డుకు ఇరుపక్కల భక్తులు తమ వాహనాలను నిలుపుకుని కొంతసేపు చెట్లకింద సేద తీరారు. మరి కొందరు చెట్లకింద భోజనాలు చేసారు. కొందరు భక్తులు షాఫాబావి వద్ద స్నానాలు చేశారు. షాఫాబావి వద్ద అటోలు ఇష్టారీతిలో పార్కింగ్ చేయటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కసుమూరులో ఆటోలను పాలిచెర్లపాడు క్రాస్‌రోడ్డు వద్దే నిలపటంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదు. మొదటిరోజు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. ఆర్టీసీ బస్సులను చందన్ మహల్ వద్ద నిలిపి వేశారు. భక్తులు తెచ్చుకున్న వాహనాలకు చెరువుకట్టతోపాటు చందన్ మాహల్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. కసుమూరులో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేసారు. భక్తుల సౌకర్యార్థం వక్ఫ్‌బోర్డు అధికారులు కొన్ని చోట్ల తాగు నీటి చల్లి వేంద్రాలు, షామియాలు ఏర్పాటు చేశారు. కానీ షాఫాబావి వద్ద కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో మహిళ భక్తులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల భద్రత కోసం దర్గా ప్రధానమార్గంలో పోలీసు అధికారులు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి అధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసారు.

బూత్ కమిటీలు పార్టీకి ప్రాణవాయువు: మేకపాటి
కావలి, సెప్టెంబర్ 21: రాజకీయ పార్టీలకు బూత్‌కమిటీలు ప్రాణవాయువు వంటివని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కావలి ఆర్‌ఎస్‌ఆర్ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన మేకపాటి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో విజయం సాధించాలంటే బూత్‌కమిటీలు కీలకమన్నారు. బూత్ కమిటీలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను పరిశీలించి మార్పులు, చేర్పులు పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ప్రజలతో సత్సంబందాలను కలిగి ఉంటూ వారితో పార్టీకి ఓటు వేయించే కీలకమైన బాధ్యత తీసుకోవాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత బూత్ కమిటీలదేనని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో బీజేపీతో కలవడం చారిత్రాత్మక తప్పిదమన్న బాబు 2014 ఎన్నికల్లో మోదీని బ్రతిమిలాడి కలిసి పోటీచేసి గెలుపొందారన్నారు. తాజాగా బీజేపీతో మళ్లీ వీడిపోయి కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమయ్యారని, అధికారం కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారనే విషయం ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఎన్నికల అనంతరం మాత్రమే పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ ప్రకటించిన విషయాన్ని కూడా విసృత్తంగా ప్రచారం చేయాలన్నారు. వైకాపాకు ఇతర పార్టీలతో లేని పొత్తులను ఆపాదించి టీడీపీ విషప్రచారం చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం మేజర్ పోర్టు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నష్టం జరగకూడదనే ఆలోచనతో రాష్ట్రప్రభుత్వం రామాయపట్నం వద్ద నాన్ మేజర్ పోర్టు నిర్మాణానికి పూనుకుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో మరోసారి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని ఆదరించి గెలిపించాలని బూత్ కమిటీలను కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్‌చార్జ్ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి నారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల అధ్యక్షులు, నియోజకవర్గలోని అన్ని బూత్‌కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.