శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అజెండా చదవకుండానే ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, సెప్టెంబర్ 24: ఒక్క అంశం కూడా పూర్తిగా చదవకుండానే మొత్తం అజెండా ఆమోదించుకోవడంతో సోమవారం జరిగిన కావలి పురపాలక సంఘ సమావేశంలో ప్రతిపక్ష వైకాపా కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో ఓటింగ్ కోసం డిమాండ్ చేశారు. వీరి అభ్యంతరాలను చైర్‌పర్సన్ పోతుగంటి అలేఖ్య పట్టించుకోకుండా సమావేశాన్ని ముగించి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో సమావేశంలో పాలకపక్షం కన్నా విపక్ష సభ్యులే ఎక్కువగా ఉండటాన్ని గమనించి ప్రతిపక్ష సభ్యులు హాజరు పుస్తకాన్ని చూపాలంటూ అధికారులను కోరారు. అయితే హాజరు పుస్తకాన్ని చైర్‌పర్సన్ తన వెంట తీసుకెళ్లడంతో ప్రతిపక్ష ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి నారాయణ మినిట్స్ పుస్తకాన్ని అధికారుల నుంచి లాక్కుని స్వాధీన పరచుకున్నారు. హాజరు పుస్తకం చూపితేనే మినిట్స్ పుస్తకం ఇస్తామని, అంతవరకు సమావేశ మందిరంలోనే ఉంటామని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో హజరు పుస్తకం కోసం మేనేజర్ సత్యనారాయణ, ఇంజనీర్ మునిశంకర్‌లు చైర్‌పర్సన్ ఛాంబర్‌లోకి వెళ్లి గంట తరువాత హాజరు పుస్తకాన్ని తెచ్చి విపక్ష సభ్యులకు చూపారు. అయితే పుస్తకంలో విపక్షం కన్నా పాలకపక్షం సభ్యుల సంతకాలు ఎక్కువగా ఉండటాన్ని గమనించి సభ్యుల సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నారని కనుమర్లపూడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి అడ్డమైన పనులు చేస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదని అసహనంగా సమావేశ మందిరం నుంచి విపక్ష సభ్యులు వెళ్లిపోయారు.

రూ.15 కోట్లు వసూలు చేసే దమ్ముందా
* విశ్వోదయ బకాయిలు ప్రస్తావించిన వైస్‌చైర్మన్ భరత్
కావలి, సెప్టెంబర్ 24: కావలి విశ్వోదయ విద్యాసంస్థల యాజమాన్యం మున్సిపాలిటీకి బకాయిపడ్డ రూ.15 కోట్లు వసూలు చేసే దమ్ము ఈ కౌన్సిల్‌కు ఉందా అంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్‌కుమార్ సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. చైర్‌పర్సన్ పోతుగంటి అలేఖ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బకాయిల విషయంలో అధికారులు సామాన్యుల పట్ల ఒకలాగా, విశ్వోదయ యాజమాన్యం పట్ల మరోలా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టారు. సదరు యాజమాన్యం రూ.15 కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. గతంలో అధిక మొత్తంలో బకాయిపడ్డ యజమానుల భవనాల వద్ద చెత్తాచెదారాన్ని వేయడం, డప్పుకొట్టడం లాంటివి చేసేవారని, వీరి పట్ల కూడా అలాగే వ్యవహరించాలని కోరారు. అవసరమైతే పట్టణంలో సేకరించే చెత్తాచెదారం మొత్తాన్ని కళాశాలలో డంప్ చేయాలని సూచించారు. కళాశాల యాజమాన్యం ఫీజుల విషయంలో విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని, మనం మాత్రం వారి పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబించాలని ప్రశ్నించారు. మీరు ఇన్‌ఛార్జి చైర్మన్‌గా ఉన్న సమయంలో ఎందుకు వసూలు చేయలేదంటూ విపక్ష సభ్యులు ప్రశ్నించడంతో అందరం కలసి వెళ్లి వసూలు చేద్దామా అంటూ భరత్ ఎదురు ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వైకాపా ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి నారాయణ చైర్మన్ ముందుండి నడిస్తే సహకరించేందుకు మేము సిద్ధమని ప్రకటించారు. ఈ విషయమై చైర్‌పర్సన్ అలేఖ్య అధికారులను వివరణ కోరారు. ఇప్పటికి మూడు నోటీసులు జారీ చేశామని, అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేదని, త్వరలో చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రణాళికాధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.