శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బాబా పాదుకల దర్శనంతో పులకించిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 24: శ్రీసద్గురు సాయిబాబా నిజపాదుకల దర్శన భాగ్యంతో నెల్లూరు వాసులు పులకించిపోతున్నారు. షిర్డీ సంస్థాన్ సహకారంతో నెల్లూరుకు ఈనెల 21న విచ్చేసిన బాబా నిజపాదుకలకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత ఏర్పాట్లతో పాటు రెండు రోజులు కనుపర్తిపాడులోని విపిఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో భక్తుల సందర్శనార్ధం చేసిన ఏర్పాట్లకు భక్తులు ముగ్ధులయ్యారు. ఫౌండేషన్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాదుకల దర్శనార్ధం వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్ల గురించి బాబా భక్తులు ఎంతో అభినందిస్తున్నారు. రెండు రోజులపాటు భక్తులకు పాదుకల దర్శనభాగ్యం కల్పించడంతో పాటు వచ్చే భక్తుల కోసం అన్నప్రసాద వితరణతో సహా అన్ని ఏర్పాట్లు సొంత ఖర్చులతో ఆయన చేయడం జరిగింది. అలాగే షిర్డీలో బాబా నిత్యం అందుకునే పూజలన్నింటిని విచ్చేసిన భక్తుల కళ్లగట్టేలా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు సాక్షాత్తూ షిర్డీలో జరుగుతున్న కైంకర్యాలన్నింటినీ కనులారా వీక్షించిన అనుభూతికి లోనయ్యారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నారు. రెండు రోజులపాటు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా దగ్గరుండీ అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు బాబా పాదుకల దర్శనం కల్పించిన వేమిరెడ్డిని నగరవాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

వైభవంగా ఫలాభిషేకం
చిట్టమూరు, సెప్టెంబర్ 24: మండలంలోని వల్లీదేవసేన సమేత స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి వైభవంగా ఫలాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను చతుస్తంభ కల్యాణమండపంలో ఉంచి వంద రకాల ఫలాలతో ఫలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయదాతలు ఈపూరు కుమారస్వామిరెడ్డి, వట్టిగుంట వెంకటసుబ్బయ్య, దువ్వూరు నారాయణరెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, జూలపాటి శ్రీనివాసులు తెచ్చిన ఫలాలతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. రాత్రి నందిసేవ కార్యక్రమంలో భాగంగా మల్లాసుర, కొల్లాసుర యుద్ధం కన్నుల పండువగా సాగింది. స్వామి మల్లాసుర, కొల్లాసుర రాక్షసులను సంహరించే ఘట్టాన్ని గ్రామస్తులు నిర్వహించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాటకచేరి ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఫలాభిషేకం అనంతరం భక్తులకు పంచిపెట్టారు. స్వామి అమ్మవార్లకు చందనాలంకారం చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలు, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, ఈవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.