శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడు వేనాడు గంధోత్సవం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, నవంబర్ 13: తడ మండలం వేనాడు దీవిలోని షేక్ దావుద్‌షావలీ అల్లా తాత దర్గాలో బుధవారం నుంచి రెండురోజులపాటు గంధోత్సవం నిర్వహించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సమాధి అయిన అల్లాతాత దర్గాను సందర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. సుమారు 144 అడుగుల ఈ సమాధిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని కోర్కెలను విన్నవించుకుంటారు. ఈ గంధోత్సవానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు రావడం విశేషం. 16వ తేదీవరకు జరిగే ఈ గంధోత్సవాన్ని బుధవారం రాత్రి గ్రామపెద్ద ఇంటి నుంచి గంధాన్ని ఊరేగింపుగా సమాధి వద్దకు తీసుకువచ్చి గంధాన్ని లేపనం చేసి భక్తులకు అందచేయటం ద్వారా ప్రారంభిస్తారు.
* ఏఆర్ రహమాన్‌కు ఆరాధ్యదైవం
ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ అత్యంత ఆరాధ్య దైవంగా షేక్ దావుద్‌వల్లీ అల్లాతాత సమాధిని కొలుస్తారు. ఏఆర్ రహమాన్ కుటుంబ సభ్యులు 2006నుంచి ఈ సమాధిని దర్శించుకుంటున్నారు. దీంతో ఈ దర్గాకు పేరుప్రఖ్యాతులు వచ్చాయి. అల్లాతాత సమాది వద్ద పురాతన కాలంనుంచి ఒకేఒక శిలాఫలకం ఉంది. ఇందులోని లిపిని గుర్తించేందుకు పురావస్తుశాఖ అధికారరులు సంవత్సరకాలం కష్టపడ్డారు. అప్పటి పురావస్తుశాఖ అధికారి లిపి వివరాలు తెలియచేశారు.
* భారీగా పోలీసులు బందోబస్తు
అల్లాతాత గందోత్సవానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. దాదాపు 100మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. భక్తులకు మంచినీటికి అసౌకర్యం కలగకుండా గ్రామపెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. గంధోత్సవం రోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తడ ఎస్సై వెంకటేశ్వరరావు దర్గావద్ద భారీ బందోబస్తుతోపాటు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.