శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేటి నుండి కార్తీకమాస లక్ష దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 15: నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈనెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ అధినేత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షణలో సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగ ప్రతిమ వద్ద మూడు రోజుల పాటు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తొలిరోజైన శుక్రవారం ఉదయం రాధానంద భారతిస్వామి ఆధ్వర్యంలో గణపతిపూజ, శ్రీ ఉమాపార్థివేశ్వరస్వామి శివలింగ ప్రతిష్ఠ, కలశస్థాన జరుగనుంది. అనంతరం 10 గంటలకు మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకాలు, సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు ఆధ్మాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేశారు. రాత్రి ఏడు గంటలకు వేమిరెడ్డి దంపతులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 17వ తేదీ ఉదయం 108 మంది దంపతులతో లక్ష కుంకుమార్చన, 10 గంటలకు విశేష చండీయాగం, రాత్రి అష్టదళ పాదపద్మపూజ, రాత్రి 8 గంటలకు హిందూ దేవాలయ ప్రతిష్ఠాపన పీఠాధిపతులు కమలానంద భారతీస్వామి అనుగ్రహభాషణం జరుగనుంది. 18వ తేదీ ఉదయం విశేష రుద్రహోమం, వీరవెంకటసత్యనారాయణ స్వామి వ్రతం, మధ్యాహ్నం ఒంటి గంటకు వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో అన్నప్రసాద వితరణ, సాయంత్రం అష్టదళ పాదపద్మపూజ, రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
ఆకట్టుకుంటున్న శివలింగ ప్రతిమ
లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా నిర్మించిన 110 అడుగుల శ్రీఉమాపార్థివేశ్వర స్వామి శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత ఏడాదికంటే ఈ ఏడాది మరింత ఎత్తుగా ఈ శివలింగ ప్రతిష్ఠ చేశారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాకు 10 పూడికతీత యంత్రాలు మంజూరు
* మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి
నెల్లూరు, నవంబర్ 15: కాలువల నుండి పూడికతీసే 10 యంత్రాలను స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు మంజూరు చేసినట్లు రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. గురువారం స్థానిక ఆదిత్యనగర్‌లో పూడికతీసే యంత్రాల పనితీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఘనవ్యర్ధాలు, నీటి వ్యర్ధాలు ఎక్కువగా ఆసుపత్రులు, హోటళ్లు ఇతర కార్యాలయాల నుండి వస్తున్నాయని తెలిపారు. ఈ వ్యర్ధాల వల్ల డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు సోకే అవకాశం ఉందని, వాటి నివారణకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను రూ.550 కోట్లతో చేపట్టామని గుర్తు చేశారు. భూగర్భ డ్రైనేజీ ద్వారా అంటువ్యాధుల నివారణకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.25 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, తొలి విడతగా విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరులలో చేపట్టినట్లు వివరించారు. 2019 మార్చినాటికి అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చి చిన్న చిన్న కాలువలకు సైతం యంత్రాలను సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతీలలో కూడా త్వరలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ అలీంబాషా, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, మహిళా కమిషన్ సభ్యురాలు అంచల వాణి, కార్పొరేటర్లు రాజానాయుడు, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.