శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శోభాయమానంగా ప్రారంభమైన కార్తీకమాస లక్ష దీపోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, కలెక్టరేట్, నవంబర్ 16: జిల్లా కేంద్రంలోని విఆర్‌సి మైదానంలో శుక్రవారం కార్తీక మాస లక్ష దీపోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల సౌజన్యంతో ఈ దీపోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. కేథారినాథ్‌లో ఉన్నట్లుగానే శివలింగాన్ని, అనంతపద్మనాభ స్వామిని ప్రతిష్టించారు. తొలిరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను ఉర్రూతలూగించాయి. శ్రీ రాధానంద భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శివలింగ ప్రతిష్ట, కలశ స్థాపన నిర్వహించారు. వేమిరెడ్డి దంపతులచే స్వామివారికి విశేష ద్రవ్యములచే అభిషేకం, బిల్వార్చన, అష్ట్ధళ పాద పద్మ పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులందరుకు స్వయంగా స్వహస్తాలతో దేవదేవునికి అభిషేకం చేసుకునే భాగ్యం లభించింది. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.

దర్గాలో భక్తుల రద్దీ * గంధం దంచిన మహిళలు
అనుమసముద్రంపేట, నవంబర్ 16 : ఏఎస్‌పేటలో జరుగుతున్న దొరసానమ్మ 245వ గంధ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం దర్గా ఆవరణలో భక్తుల రద్దీ ఏర్పడింది. శుక్రవారం రాత్రి జరిగే గంధోత్సవంలో భాగంగా మహల్‌లోని సజ్జాదా నషీన్ ముతావలి షాగులాం నక్షాబంద్ హఫీస్ పాషా గృహంలో గంధోత్సవాలకు ముందుగా గంధం దంచే కార్యక్రమం నిర్వహించారు. తొలుత పీఠాధిపతి హఫీజ్ పాషా కుటుంబ సభ్యులు గంధం దంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలు పాల్గొని గంధం దంచే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. వర్షం కురుస్తుండటంతో యాత్రికులు కొంతమేర అవస్థలకు గురయ్యారు. దర్గాను విద్యుద్దీపాలతో అలంకరించారు.