శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జాతీయస్థాయిలో అందరినీ ఒకేతాటిపై నడిపే సత్తా చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, నవంబర్ 16: జాతీయస్థాయిలో అందరినీ ఏకతాటిపై నడిపే సత్తాగల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని విమర్శించారు. పక్కరాష్టమ్రైన తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం చేసిన పెద్దమనిషి ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి, ఆమిత్‌షాకు చెక్ పెట్టి జీవితం గుర్తుండేలా చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అన్నారు. కేంద్ర సహకారం లేకనే వృద్ధి రేటులో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, అదే కేంద్రం ఏపీకి సహకరించి ఉంటే దేశంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉండేవారమని తెలిపారు. నాలుగేళ్లలో రైతులు పండిచిన పంటకు రూ.3800 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో నెల్లూరులో జరిగిన దళితతేజం సభను భారీస్థాయిలో విజయవంతం చేశారని, అదేవిధంగా ఈ నెల 20న నెల్లూరులో జరిగే ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మోసం చేసింది బీజేపీనే : మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజ్యసభలో ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఆమోదం తెలిపి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి తీరని మోసం చేసిన ఘనత బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకే దక్కిందని రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పొంగూరు నారాయణ దుయ్యబట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కేంద్రం అమలు చేయకపోవడం దారుణమన్నారు. విభన చట్టంలో దుగరాజుపట్నం, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ మెట్రోలైన్ తదితర ప్రాజెక్టులు అమలు చేసి ఉంటే ఎంతో కొంత నిరుద్యోగ సమస్య తీరి ఉండేదని అన్నారు. 19 సార్లు ముఖ్యమంత్రి కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మేల్కొన్న ముఖ్యమంత్రి బీజేపీతో తెగతెంపులు చేసుకొని బీజేపీపై సమరభేరి మోగించారని అన్నారు. కనీసం బడ్జెట్‌లో కూడా ఏపీ ఊసేలేకుండా చేసిన ఘనుడు నరేంద్రమోదీడి అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోదీపై ఎదురుతిరిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు.
బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు : ఎమ్మెల్యే కురుగొండ్ల:
గడిచిన నాలుగన్నరేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేసిందని, అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. గత ప్రధాని వాజ్‌పాయ్ ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలుగా సహకరించారని, ఇప్పడు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో అన్నివిధాల నాశనం చేశారని ఆరోపించారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి ఏపీలోని కొంతమంది టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని వారి పేర్లను అమిత్‌షాకు రాసిస్తే వారి ఇళ్లపై ఐటి దాడులు చేసే సంస్కృతికి నేడు బీజేపీ తయారైందని అన్నారు. దేశంలో మతకల్లోలాలు సృష్టిస్తూ నియంత పాలన సాగిస్తున్న బీజేపీని దేశం నుంచే తరిమికొట్టాలని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలను సైతం నడపగల సత్తా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని ఎదుర్కోలేక, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రజల జీవితాలతో చెలగాటం అడుతున్న ప్రధాని నరేంద్రమోదీని, అమిత్‌షాను తరమికొట్టాల్సిన సమయం దగ్గరపడిందని అన్నారు. ముందుగా వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షుడు కె సంజీవరెడ్డి, మాజీ అధ్యక్షుడు పప్పు చంద్రవౌళిరెడ్డి మంత్రులకు పూల కిరీటాలు, గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెలికం శంకరెడ్డి, పొలంరెడ్డి వెంకటరెడ్డి, యాలేశ్వరం రామచంద్రనాయుడు, వెంకటగిరి ఎంపీపీ మునెమ్మ, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.