శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆశలు రేపుతున్న చినుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 16: జిల్లా అంతటా ‘గజ’ తుఫాన్ ప్రభావంతో గత 24 గంటలుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు తీర ప్రాంత మండలాల్లో మాత్రమే కురుస్తూ వచ్చిన వానలు శుక్రవారం నుంచి మెట్ట ప్రాంతాల్లోనూ కురుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం చిరుజల్లులతో ప్రారంభమైన వానలు శుక్రవారం నాటికి ఓ మోస్తరు వర్షాలుగా మారాయి. జిల్లాలోని గూడూరు, కోట, ఆత్మకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాసేపు వర్షం, మరికాసేపు ఎండ, మరికొంత సేపు పొడి వాతావరణం..ఇలా ఒకే రోజు మూడు రకాల వాతావరణాన్ని ప్రజలు చవిచూశారు. నగరంలో శుక్రవారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులతో ప్రారంభమైన చినుకులు సాయంత్రానికి ఆకాశం మేఘావృతంగా మారిపోయి సుమారు అరగంట పాటు భారీ వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన వర్షానికే నెల్లూరు నగరంలోని రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సమగ్ర తాగునీటి వ్యవస్థల కోసం నగరంలోని రోడ్లన్నీ ఎక్కడికక్కడ తవ్వి వదిలేసి ఉండటంతో రోడ్లపై వర్షతాకిడితో బురద పేరుకుపోయింది. ముఖ్యంగా మినీ బైపాస్ రోడ్డు, గాంధీనగర్, అయ్యప్పగుడి, బాలాజీనగర్, హరనాథపురం, వేదాయపాలెం, కొత్తూరు, చంద్రబాబునగర్, ఎన్ టీ ఆర్ నగర్, కొండాయపాలెం గేట్ తదితర ప్రాంతాలు బురదమయంగా మారిపోయి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యంగా మారిపోయాయి. తుఫాన్ ప్రభావం సోమవారం వరకూ ఉండే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సమాచారం మేరకు వానలు మరోరెండు రోజుల పాటు కురుస్తాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో తొలి పంటకు సాగునీటి కొరతతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నెలకొన్ని తాగునీటి సమస్య తొలగుతుందని భావిస్తున్నారు.