శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైలు మార్గం భూసేకరణ పనులు వేగవంతం చేయాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, నవంబర్ 17: నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో శనివారం రైల్వే మార్గం, విమానాశ్రయం, భారతమాల భూసేకరణ పనులపై జెసి-1, కావలి, గూడూరు సబ్ కలెక్టర్‌లు సిహెచ్ శ్రీ్ధర్, ఒ ఆనంద్, డిఆర్‌ఒ నాగేశ్వరరావులతో కలసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి సంబంధించి జిల్లాలోని 11 మండలాల్లో 57 గ్రామాల్లో 79 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే 8 గ్రామాల్లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డిడి) ప్రచురించటం జరిగిందన్నారు. మిగిలిన 36 గ్రామాలలో ప్రతిపాదనలు అందనందున ఈనెల 24న డిడి ప్రచురించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని చేజర్ల, డక్కిలి, పొదలకూరు మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలను 24వ తేదీకి సమర్పించాలన్నారు. రాపూరు, డక్కిలి, వెంకటగిరి, పొదలకూరు, వరికుంటపాడు, కలిగిరి, వింజమూరు మండలాలలో ప్రభుత్వ భూములు అలినేషన్ ప్రతిపాదనలు 24లోగా పంపాలన్నారు. ఆత్మకూరు, ఎఎస్ పేట, చేజర్ల, పొదలకూరు, రాపూరు మండలాలలో చుక్కల భూములకు సంబంధించి రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, 100 ఇసి, అన్నివిధాల పరిశీలన చేసి నివేదిక పంపాలన్నారు. ఆక్రమణలు లేని ప్రభుత్వ భూములను వచ్చే సోమవారానికి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి కొత్తపల్లి కౌరుగుంట, దామవరం గ్రామాల్లోని 107 ఎకరాల పట్టా భూముల సేకరణ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. డేగపూడి-బండేపల్లి కాలువకు సంబంధించి ఒక వారంలోగా 71 ఎకరాల భూసేకరణ కోసం నెల్లూరు ఆర్‌డిఒ, గూడూరు సబ్ కలెక్టర్ అవార్డు మంజూరు చేసి పంపాలన్నారు. భారతమాల ఏర్పాటుకు సంబంధించి ఎక్కడా సర్వే మిగలరాదన్నారు. సమావేశంలో జెసి-2 కమలకుమారి, నెల్లూరు, నాయుడుపేట, ఆర్‌డిఒలు చిన్నికృష్ణ, శ్రీదేవి, జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, మేనేజరు విద్యావాణి, ఎస్‌సి రైల్వే ఇఇ శైలేష్, ఎఇ బాషా, పలు మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.