శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందుకూరుపేట, నవంబర్ 17: త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని డేవిస్‌పేట జైన్ దేవాలయ సమావేశ మందిరంలో వైకాపా మండల బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి ఘటనపై సిబిఐతో విచారణ చేపట్టడానికి చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. సిబిఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడి జగన్‌పై ప్రజలు అభిమానం పెంచుకుంటారన్న భయంతోనే చంద్రబాబు సిబిఐకి ఆదేశించ లేదని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని నేడు వారితో తెగతెంపులు చేసుకుని విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. చంద్రబాబు తన సంకుచిత వైఖరిని వీడి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు రాష్ట్రానికి హరిత టూరిజం కింద రూ. 60 కోట్లు మంజూరు చేశారని అందులో జిల్లాలోని మైపాడు, కోడూరు, రామతీర్థం ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి రూ. 16 కోట్లు మంజూరు చేశారన్నారు. ఐతే చంద్రబాబు తానే ఆ నిధులు విడుదల చేశానని చెప్పుకోవడం మంచి మద్ధతి కాదన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేస్తుంటే వంద శాతం నిధులు ఇస్తోందని అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిమెంటు రోడ్ల అభివృద్ధికి కేంద్ర నిధులు ఖర్చు చేస్తూ రాష్ట్ర నిధులుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టీడీపీ అవినీతి పాలనపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా మేకపాటి, నల్లపరెడ్డిని నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ మావులూరి శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గొల్లపలి విజయకుమార్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణయ్య, మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కైలాసం శ్రీనివాసులురెడ్డి, డేవిస్‌పేట మాజీ సర్పంచ్ వెంకటరమణయ్య, శిగనం సుబ్రహ్మణ్యం, అంగీరు ఫకీరయ్య, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఎస్‌డిఎఫ్ పనులను
వేగవంతంగా పూర్తిచేయాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, నవంబర్ 17: గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్‌డిఎఫ్) ద్వారా చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలసి ఎస్‌డిఎఫ్ గ్రాంటు కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లింపులపై పంచాయతీరాజ్ ఎస్‌ఇ, పిఒఎ కార్యాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తయిన 50శాతం పనులను ఇంజనీరింగ్ బృందాలతో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. 50 శాతం పనులను పంచాయతీరాజ్ నాణ్యత, నియంత్రణ సిబ్బందితో తనిఖీలు చేపట్టాలన్నారు. సిసి రహదారుల పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ రవిచంద్ర మాట్లాడుతూ గ్రామాలలో పనులు నిర్వహించే వారికి నిబంధనల ప్రకారం వెంటనే చెల్లింపులు చేయాలన్నారు. చెల్లింపులు సమయంలో ఇబ్బందులు తలెత్తితే కలెక్టర్ దృష్టికి తీసుకరావాలన్నారు. పి ఆర్ ఇంజనీరింగ్ శాఖ, పే అండ్ అకౌంట్స్ అధికారులు సమన్వయంతో చెల్లింపు చేయాలని సూచించారు. సమావేశంలో పిఆర్ ఎస్‌ఇ పి నాగేశ్వరరావు, కావలి, గూడూరు, నెల్లూరు, ఇఇలు విజయకుమార్, మహేశ్వరయ్య, కాంతారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.