శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సోమశిల జలాలకై రైతులతో కలసి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమసముద్రంపేట, నవంబర్ 17: ఆత్మకూరు నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందించేందుకు రైతులు కలసి వస్తే సోమశిల జలాల విడుదలకు కలసి పోరాడతానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశిల ప్రాజెక్టు ఉన్నప్పటికీ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల నెల్లూరులో జరిగిన ఐఏబి సమావేశంలో ఆత్మకూరు, ఏఎస్ పేట మండలాలు తీవ్ర కరవుతో ఉన్నాయని తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశానన్నారు. రైతులు తనతో కలసి వస్తే పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. వర్షాలు లేకున్నా ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని అధికారులు చెప్పేది ఒకటి చేసేది మరోలా ఉందన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అర్హులైన వారు పింఛన్ల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనవరి నాటికి నూతన పింఛన్లు అందజేస్తామన్నారు. లబ్ధిదారులకు సబ్సిడీపై మంజూరైన రుణాలను బ్యాంకర్లతో మాట్లాడి గ్రౌండింగ్ అయ్యేవిధంగా చూడాలని అధికారులకు కోరారు. ఆధరణ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, కూలీలకు కల్పిస్తున్న పని దినాలపై ఆరా తీశారు. ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలౌతున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎంపిపి నంది ప్రభావతి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల కె హజరత్తమ్మ, ఎంపిడీవో ప్రసన్న, ఎంపీటీసీలు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.