శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

త్వరలో సోమశిల హైలెవల్ కెనాల్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిగిరి, నవంబర్ 17 : సోమశిల హైలెవల్ కెనాల్ పనులు వీలైనంత త్వరలో చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. పెద్దిరెడ్డిపాడు రిజర్వాయర్ పనులు త్వరగా జరిపించి ఉదయగిరి నియోజకవర్గంలోని మెట్ట భూములకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కలిగిరిలో తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం శనివారం ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధులుగా సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కేంద్రంపై పోరాటం కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో ధర్మపోరాట దీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారన్నారు. కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున్న పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వింజమూరులో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను సరిష్కరించేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి రూ. 35 కోట్ల నిధులు మంజూరయ్యాయని త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. కలిగిరి 2 చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తామన్నారు. సీజెఎఫ్‌ఎస్ భూముల లబ్ధిదారుల ఎంపికలో చిరు లోపాలు జరిగాయని వాటిని సరిదిద్ది అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సోమశిల రిజర్వాయర్ నుండి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు రిజ్వర్వాయర్‌కు నీళ్లను అందిస్తున్నామన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఐనప్పటికీ సోమశిల జలాశయానికి 48 టీఎంసీలు కృష్ణా జలాలను తీసుకుచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఉదయగిరిలో తమ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని బొల్లినేనికి కేంధ్రంలో ఉన్న పరిచయాలతో ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని కొనియాడారు. దేశంలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే రాష్ట్రంలో 10.5 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ద్వితీయ స్థానంలో తెలంగాణ, 5వ స్థానంలో గుజరాత్‌లు ఉన్నాయని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. రాబోవు ఎన్నికల్లో జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన జ్యోసం చెప్పారు. అభివృద్ధిని వివరించి ప్రజలను ఓటు అడగాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ అభిమాని ఆయన్ను కత్తితో పొడిస్తే 25 రోజులుగా జగన్ సొంత మీడియాలో చంద్రబాబు నాయుడుపై నిందలు మోపడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీ రోజు రోజుకూ నవ్వులపాలు అవుతోందని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రజల నుండి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రామానాయుడు, బిజ్జం కృష్ణారెడ్డి, ఎం వెంకటరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.