శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సర్వేలతో సిట్టింగ్‌ల పని సరి సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 17: జిల్లాలో అధికార టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన సర్వే ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు సంతృప్తిని, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి ఫలితాలు వచ్చినట్లు సమాచారం. గురు, శుక్రవారాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఫోన్ ద్వారా సర్వే జరిగింది. సర్వేలో భాగంగా మూడు ప్రశ్నలను ముఖ్యమంత్రి గొంతుతో నియోజకవర్గంలోని ప్రజల నుండి సమాధానాలు సేకరించారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోనూ అత్యధికులు స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై వ్యక్తం చేసిన అసంతృప్తి పార్టీ పెద్దల్లో ఆందోళన రేకెత్తించింది. జిల్లాలో టీడీపీకి ఉదయగిరి, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండగా, గూడూరు నుండి వైకాపా తరపున గెలిచిన ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ కూడా ప్రస్తుతం వైకాపాను వీడి టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మిగతా ఆరు నియోజకవర్గాల కంటే ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఐవిఆర్‌ఎస్ పద్ధతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వాయిస్‌తో గురు, శుక్రవారాల్లో అభిప్రాయ సేకరణ జరిగింది. స్థానికులతో పాటు పార్టీ క్రియాశీలక కార్యకర్తల నుండి కూడా అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మూడు ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా?’, ‘మీ నియోజకవర్గ ఎమ్మల్యే పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని పని చేస్తున్నారా’?, ‘మీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను బాగా అమలు చేస్తున్నారా’?.. వంటి ప్రశ్నలకు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సర్వేలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలందరు కూడా కార్యకర్తల సంతృప్తిని పొందలేకపోవడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు.. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌పై 67 శాతం అసంతృప్తి వ్యక్తం చేయగా, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పనితీరుపై 73 శాతం, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై 77 శాతం, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై 73 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలను, నేతలను అందరినీ సమన్వయం చేసుకోలేక పోతున్నారని, ముఖ్యంగా కోవూరులో స్థానిక ఎమ్మెల్యేకు, పార్టీ కార్యకర్తలకు మధ్య పొసగడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ నియమావళికి విరుద్ధంగా తానే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు పోలంరెడ్డి ప్రకటించడం కూడా కార్యకర్తల్లో అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఈ సర్వే గురించి తెలియడం, సర్వేలో సేకరించిన సమాధానాలను ముఖ్యమంత్రి ఎదుట ఉంచనున్నారనే సంగతి వెలుగుచూడడంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందంటూ పలు సర్వేల్లో వెల్లడవుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల పనితీరు మాత్రం సంతృప్తిగా లేదని, వారు మారడం లేదంటూ పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి తరచూ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ఈ సర్వే మూలాన ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ గల్లంతవుతుందో తెలియక అందరిలోనూ బెంగ పట్టుకుంది.

నవోదయ విద్యాలయాన్ని సందర్శించిన ఎంపి వేమిరెడ్డి
నెల్లూరు, నవంబర్ 17: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ, స్కూల్ ఫలితాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. వేమిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ గురించి జిల్లావ్యాప్తంగా వైడ్ పబ్లిసిటీ ఇవ్సాల్సిన అవసరం ఉందని, అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అడ్మిషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా స్కూల్ ఫలితాలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆడియో, వీడియో ద్వారా ప్రయోగాత్మక అంశాలను విద్యార్థులకు తెలియచేయాలని, విద్యార్థులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పించి స్కూల్ ఆవరణ పరిసరాలు శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర విద్యాసంబంధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, సలహా కమిటీ సమావేశాల్లో పిల్లల తల్లిదండ్రులకు అవకాశం కల్పించి వారి సూచనలు, సలహాలు తీసుకొని అందుకు అనుగుణంగా స్కూల్‌లో కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ కోరగా తప్పకుండా సూచనలు పాటిస్తామని ప్రిన్సిపాల్ హామీనిచ్చారు. నవోదయ విద్యాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని వేమిరెడ్డి ఆయనకు హామీనిచ్చారు.