శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైఎస్ హయాంలోనే ఆరోగ్య, ఆహార భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, నవంబర్ 18: పేద ప్రజలకు ఆరోగ్య, ఆహార భద్రత విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిగా నిలిచాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని మాజీ ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజలు అత్యంత విలువైన కార్పొరేట్ వైద్యాన్ని అందుకున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాల ద్వారా అందించిన వైద్య సేవలు నేటికీ పేద ప్రజలకు గుర్తుకు వస్తుంటాయని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వమే కావాలంటే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పేద ప్రజల వైద్యం కోసం సొంత నిధులు వెచ్చించి ఉచితంగా వైద్యం మందులు ఆపరేషన్లు అందించడం పేద ప్రజల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ కనిపిస్తుందని ఆయన తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ గడిచిన నాలుగు సంవత్సరాల నుండి ప్రజలలో తిరుగుతూ వారికి అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాటం చేయడం కోటంరెడ్డి నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. అనంతరం నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైన జరిగిన దాడిని వారి కుటుంబ సభ్యులే చేపించారని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం ఆ పార్టీ దౌర్భాగ్యానికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలుపొందే స్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిదేనని ఆయన జోస్యం చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు పోటీ చేయాలంటేనే ఆలోచించే స్థితికి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోవు ఎన్నికలు ముఖ్యంగా నెల్లూరు రూరల్‌లో కోటేశ్వరులకు, సామాన్యుడికి మధ్య ఎన్నికగా ఆయన పోల్చారు. ఈ కార్యక్రమంలో ఆనం విజయకుమార్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతిలోపు భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తిచేయాలి
* అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం
నెల్లూరు రూరల్, నవంబర్ 18: నగరంలో జరుగుతున్న భూగర్భ తాగునీటి పైపుల నిర్మాణాన్ని సంక్రాంతిలోపు పూర్తిచేయాలని అధికారులు, ఏజన్సీలను పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. ఆదివారం చింతారెడ్డిపాళెంలోని తన క్యాంపు కార్యాలయంలో నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 వందల కోట్ల రూపాయలతో భూగర్భ తాగునీటి పనులను నెల్లూరులో శరవేగంగా జరుగుతున్నాయని, కొన్ని ఏజన్సీలు నిర్లక్ష్య ధోరణితో పనులు వేగవంతంగా చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 450 కిలోమీటర్ల మేర నగరంలో రోడ్ల నిర్మాణం చేయావల్సి ఉందని, ఇప్పటివరకు వంద కిలోమీటర్ల వరకే కొత్తరోడ్ల నిర్మాణం చేశారని, మిగతా 350 కిలోమీటర్ల రోడ్లను సంక్రాంతిలోపు పూర్తిచేయాలని ఎల్ అండ్ టి సంబంధిత ఏజన్సీకి ఆదేశించారు. వర్షాకాలం కావడంతో ఈ రోడ్ల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అందువలనే పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి జరుగుతున్న సమయలో ప్రజలకు కొంత ఇబ్బంది తప్పదని కొంత ఓర్పు వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తాము ఏర్పాటు చేస్తున్న తాగునీటి వ్యవస్థ మరో 50 సంవత్సరాల వరకు నగర ప్రజల అవసరాలను తీర్చుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా బారాసాహెబ్ దర్గా నుండి ఇరుకళలమ్మ దేవస్థానం వరకు నిర్మిస్తున్న ఎన్‌టిఆర్ ఘాట్ పనులు కూడా త్వరలోనే పూర్తిచేయడానికి శరవేగంగా పనులు మొదలుపెట్టినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, ఏజన్సీలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.