శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడు ఇందిరాగాంధీ శత జయంతి వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 18: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శత జయంతి వేడుకను నెల్లూరులో ఘనంగా నిర్వహించేందుకు డీసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేస్తున్నారు. రఘువీరారెడ్డి ఆదివారం నుండే జిల్లాలో పర్యటిస్తున్నారు. మిగతా నేతలు సోమవారం ఉదయానికి చేరుకొని ఇందిరాభవన్‌లో జరిగే ఇందిరాగాంధీ శత జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య పిలుపునిచ్చారు.

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యత
* మంత్రి నారాయణ స్పష్టం
నెల్లూరుసిటీ, నవంబర్ 18: నగరంలోని 53, 54 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదివారం మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలుగుదేశం పార్టీకున్న సైన్యం ఏ పార్టీకి లేదన్నారు. యువ నాయకులు నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతిఒక్కరికి జీవిత బీమా సౌకర్యం కల్పించారన్నారు. కార్యకర్త మరణిస్తే వారి పిల్లలకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్య, పార్టీ తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. బీజేపీ దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీరం చేస్తోందని విమర్శించారు. శాంతిమయమైన భారతదేశంలో నియంతృత్వ పోకడలను మోదీ, షా అనుసరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యన్ని రక్షించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, తాళ్ళపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.