శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కార్తీకమాసంలో భక్తికి వంద రెట్లు ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 18: కార్తీకమాసంలో భగవంతుని పట్ల చూపే భక్తికి, చేసే పూజలకు వంద రెట్లు ఫలితం లభిస్తుందని ఇస్కాన్ టెంపుల్ సుకదేవస్వామి స్పష్టం చేశారు. కార్తీకమాస వనభోజన విశిష్టతను ఆయన ఆదివారం దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. కార్తీక మాసాన్ని దామోదర మాసమని, ఊర్జా మాసమని కూడా అంటారన్నారు. ఊర్జా మాసమంటే ఆధ్మాత్మిక బలం పొందే అవకాశమని వివరించారు. వనవాసంలో ప్రకృతికి దగ్గరగా ఉంటామని, కాలుష్య వాతావరణం నుండి ప్రకృతిలోకి వెళ్లినపుడు ఉల్లాసం కలుగుతుందన్నారు. సాధారణ జీవితానికి అవసరమైన తిండి, గుడ్డ, నీడ ప్రకృతిలో పొందవచ్చని, అయితే మనిషి వీటిని కృత్రిమం చేసి కేవలం భౌతిక అవసరాలకే పనిపెట్టుకొని ఆధ్మాత్మిక జీవనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం అంటే పుట్టుక, చావులే కాదని, తరువాత కూడా ఉంటామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. మనిషి గీతలో చెప్పినట్లుగా బతికితే తన ఆయువు, జీవన, ఆనంద ప్రమాణాలను మెరుగు పర్చుకోగలడన్నారు. భగవన్నామం ద్వారా మన చైతన్యాన్ని తమో రజో గుణాల నుండి సత్యగుణంలోకి తీసుకురావాలని సూచించారు.

ఘనంగా ముగిసిన లక్ష దీపోత్సవ కార్యక్రమం
నెల్లూరు, నవంబర్ 18: నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో మూడు రోజుల నుండి జరుగుతున్న కార్తీకమాస లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజైన ఆదివారం శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. హాజరైన భక్తులతో దీపోత్సవ ప్రాంగణం కిటకిటలాడింది. అంతక్రితం ఉదయం 8.30 గంటలకు కార్యక్రమాల్లో భాగంగా విశేష రుద్రహోమాన్ని మావిళ్లపల్లి వెంకటేశ్వర్లునాయుడు దంపతుల సౌజన్యంతో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 9 గంటలకు వాల్మేటి శ్రీనివాసులరెడ్డి దంపతుల సౌజన్యంతో ఏర్పాటుచేసిన వీర వెంకట సత్యనారాయణస్వామి వ్రతంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అర్చకుల వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల స్వరహోరులో ఘనంగా జరిగింది. సాయంత్రం శ్రీ ఉమామహేశ్వరస్వామికి అష్టదళ పాదపద్మపూజ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. శృంగేరీ విరూపాక్ష పీఠాధిపతి గంభీరానంద భారతీస్వామి అనుగ్రహ భూషణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ప్రవచన కార్యక్రమాల్లో భాగంగా సత్య స్వరూపరాణి, పాటూరి రాధాకృష్ణల ఆధ్మాత్మిక ఉపన్యాసం శివభక్తి పవిత్రతను తెలియచేసింది. గట్టుపల్లి పవన్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దీపోత్సవ కార్యక్రమ ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన రాజ్యసభ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులను నగరవాసులు అభినందించారు.