శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నదుల అనుసంధానంతో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 19 : కృష్ణా - పెన్నా నదుల అనుసంధానంతో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని డీసీ పల్లి వద్ద రూ. 15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పంపింగ్ స్కీమ్‌ను సోమవారం జిల్లాపరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆదాల మాట్లాడుతూ సాగునీటి సౌకర్యం పెద్దగా లేని మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ విధానానికి రూపకల్పన చేసిందన్నారు. అందులో భాగంగానే 2015వ సంవ్సరంలో రూ. సుమారు 15 కోట్ల వ్యయంతో మర్రిపాడు మండలం డీసీ పల్లి వద్దగల కనుపూరుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా మెట్ట ప్రాంతాలకు పెన్నానది నుండి సాగునీరు అందిచేందుకు విశేష కృషి చేశామన్నారు. ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుల మూడేళ్ల కృషితో 6.5 కిలోమీటర్ల పంపిగ్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ప్రాజెక్టు నుండి ఆత్మకూరు ప్రాంతంలో అధికారికంగా 1400, అనధికారికంగా మరో 600 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. బొల్లినేని కృష్ణయ్య దాతృత్వంతో ముందుగా పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి రైతులకు మహోపకారం చేశారన్నారు. కృష్ణా - పెన్నా నదుల అనుసంధానం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల అని, ఆ కల సాకారం అయితే రాష్ట్రంలోని మెట్టప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. అనంతరం జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందుచూపుతో సోమశిలకు కృష్ణా జలాలను తరలించారన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న జిల్లాలో సోమశిల ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటి నిల్వలు ఉండడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఇటీవల జరిగిన ఐఏబి సమావేశంలో పెన్నా డెల్టా ఆయకట్టు కింద సాగునీటి లక్ష్యం 1.75 లక్షల ఎకరాలుగా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గానికి 2.9 టీఎంసీలు మాత్రమే కేటాయించారన్నారు. ఈ దామాషాలో నియోజవర్గంలోని ఏఎస్‌పేట మండలంలోని 15 చెరువులకు సాగు, ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితి ఉందన్నారు. నియోజకవర్గంలో సోమశిల ప్రాజెక్టు ఉన్నప్పటికీ అవసరమైన నీరు కేటాయించుకునే పరిస్థితి లేదన్నారు. పెన్నా డెల్టాకు మాత్రం 3 లక్షల ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారన్నారు. ఐఏబి సమావేశంలో ఇదేమని ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. మెట్ట ప్రాంత రైతులు తమ సాగునీటి హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బొల్లినేని కృష్ణయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను మంగళవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గ రైతాంగానికి మరో 1.5 టీఎంసీల నీరు కేటాయించేలా ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సోమశిల ప్రాజెక్టు అధ్యక్షులు సుందరరామిరెడ్డి, బొల్లినేని వైద్యశాల ఈడీ గిరినాయుడు, జనార్థన్‌రెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాజావలి, యువత నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లునాయుడు, రైతులు పాల్గొన్నారు.