శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మార్చి నాటికి భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 19: నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల పనులు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం స్థానిక రామ్మూర్తినగర్‌లో కాలువలు శుభ్రపరిచే యంత్రం, చెత్తను సేకరించే యంత్రాల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రానున్న వందేళ్లలో నగర జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని భూగర్భ డ్రైనేజీ తదితర పనులు చేపట్టామన్నారు. చేపట్టిన పనులు వర్షాకాలం వరకు ఉండాల్సి ఉన్నందున పనులు వేగవంతంగా కాకుండా కొంత ఆలస్యమైందని, మూడేళ్ల కాలవ్యవధిలో రెండేళ్ల లోపల పనులు పూర్తిచేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనుల వల్ల జరుగుతున్న అసౌకర్యాన్ని పెద్ద మనసుతో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని, నౌకాశ్రయాలు ఉన్న ప్రదేశాల్లో జనాభా పెరుగుదలతోపాటు అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా ఉంటాయన్నారు. ఇళ్ల ముందు ఉండే ర్యాంపుల విషయంలో అన్నీ ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని, నాణ్యత లోపించిన రోడ్ల విషయంలో సంబంధిత గుత్తేదారులకు బిల్లులు సైతం చెల్లించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శిలాఫలకాలకు ప్రాధాన్యతనివ్వకుండా అభివృద్ధి పనులకు మాత్రమే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నగర కమిషనర్ అలీంబాష, డిఇఓ శామ్యూల్, ఎస్‌ఇ రామ్మోహన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు దొడ్డపనేని రాజానాయుడు, అంచూరు జానకి తదితరులు పాల్గొన్నారు.