ప్రకాశం

టిఆర్‌ఎస్ విజయంతో ఖంగుతిన్న టీడీపీ, కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 11: తెలంగాణలో మహాకూటమి ఘోరంగా ఓటమిపాలై టిఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందటంతో జిల్లాలోని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖంగుతిన్నాయి. తెలంగాణలో మహాకూటమి గెలుపొంది తీరుతుందని దీంతో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీలు పురోభివృద్ధి చెందుతాయన్న భావన ఆ పార్టీనేతల్లో నెలకొన్నట్లు సమాచారం. కాని వారి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ ఓటరు తీర్పునివ్వటంతో రానున్న ఎన్నికల్లో ఆ ప్రభావం చూపిస్తుందా? అన్న చర్చ తెలుగుతమ్ముళ్లల్లో వినిపిస్తోందనే చెప్పవచ్చు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీతో కాంగ్రెస్‌పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి మహాకూటమీ పేరుతో దిగటం జరిగింది. జాతీయ చానల్స్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారపగ్గాలు చేపడుతుందని ప్రకటించగా ఒక్క విజయవాడ మాజీపార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మాత్రం మహాకూటమమి వస్తుందని ప్రకటించారు. దీంతో రాజకీయంగా వేడెక్కింది. లగడపాటి సర్వేపై అన్నివర్గాల్లో పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లాలోని కొంతమంది పందెం రాయుళ్ళు కోట్లరూపాయల్లో పందాలు కాసి ఆర్థికంగా గుల్లఅయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి లగడపాటి సర్వే తమ కొంప ముంచిందంటూ పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఈ ఫలితాలపై తీవ్రస్థాయిలో అంతర్మథనంలో పడ్డారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీతో తెలుగుదేశంపార్టీ పొత్తుపెట్టుకోగా ఆ పొత్తు ఆంధ్రప్రదేశ్‌లోను ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. కాని ఫలితాలు భిన్నంగా ఉండటంతో రానున్న రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో కాంగ్రెస్‌పార్టీ పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ ఇప్పటి నుండే సాగుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయంనుండి ఎన్నికల ఫలితాలను చూసేందుకు అన్నిరాజకీయపక్షాల నాయకులు టీవిలకు అతుక్కుపోయారు. తొలినుండి టీఆర్‌ఎస్ ఆధీక్యత కనబరుస్తుండటంతో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీశ్రేణులు ఖంగుతిన్నాయనే చెప్పవచ్చు. కాగా తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ తరుపున పోటీచేసిన అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ జిల్లాకు చెందిన తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఎక్కడ తెలుగువారు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో తెలుసుకుని ఆయాప్రాంతాల్లో మన నేతలు ప్రచారం చేసినప్పటికి ఫలితాలు మాత్రం రాకపోవటంతో ఆయావర్గాల్లోను తీవ్ర నిరాశ నెలకొన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. మొత్తంమీద తెలంగాణ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీల నేతలను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరిచాయనే చెప్పవచ్చు.