శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైళ్ల రద్దుతో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిన గూడూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 21: దక్షిణి మధ్య రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ మరమ్మతుల సందర్భంగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు ఆదివారం నాటితో విద్యాసంస్థలకు పండుగ సెలవులు ముగియడంతో గూడూరు ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండు ప్రాంతాలు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సోమవారం ఉదయం నుంచి అనేక మంది ప్రయాణీకులతో పాటు భారీగా విద్యార్థులు, ఉద్యోగులు తిరుపతి, చెన్నై, విజయవాడ, హైదరాబాదు, ఒంగోలు, నెల్లూరు, తదితర ప్రాంతాలకు భారీగా గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అనేక రైళ్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేయడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అనేక మంది ప్రయాణీకులు గూడూరు ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా ఆయా ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులు బస్సుల కోసం పరుగులు తీశారు. ఈనేపథ్యంలో గూడూరు రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండుకు ప్రయాణికులు చేరుకునే సమయంలో ఆటోవాలాలు ప్రయాణీకుల నుంచి అత్యధికంగా చార్జీలతో దోచుకున్నారు. ఈసందర్భంగా గూడూరు రైల్వే జంక్షన్ మేనేజర్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలు పట్టాల మరమ్మతులు చేపట్టామని, దీంతో అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన కూడా ఇచ్చామన్నారు. ప్రయాణీకులు కూడా ఈ సమస్యను అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైలు పట్టాల మరమ్మతు కారణంగా మరికొద్ది రోజులు ఈ రైళ్ల రద్దును కొనసాగిస్తున్నామని వివరించారు. అయితే గూడూరు ఆర్టీసీ అధికారులు తగినన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యార్ధం మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని సూళ్లూరుపేట, వాకాడు, రాపూరు, వెంకటగిరి డిపోల నుంచి ఆయా ప్రాంతాలకు ప్రయాణీకుల సౌకర్యార్ధం బస్సులను పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.