శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పక్షుల పండుగపై జిల్లా యంత్రాంగం మీనమేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 21: సూళ్లూరుపేట వేదికగా ప్రతియేటా నిర్వహించే పక్షుల పండుగ నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం మీనవేషాలు లెక్కిస్తోంది. అంతకుముందు మాములుగా స్థానికుల సహకారంతో నిర్వహించే ఈ పండుగను 2014 నుంచి రాష్ట్రంలో నిర్వహించే పండుగల్లో చేర్చి ప్రభుత్వమే నిధులు కేటాయించి నిర్వహిస్తూ వచ్చింది. ప్రభుత్వం నిధులు కేటాయించినా జిల్లా అధికార బృందం ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహించేవారు. కాని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పండుగకు నిధులు కేటాయించినా బూడిలో పోసిన పన్నీరులా మారిందే తప్ప ఏర్పాట్లు సరిగా చేయలేదు. మైదానంలో ఏర్పాట్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. ఈవెంట్‌కు అప్పగించిన ఏర్పాట్లు అన్నీ జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణలో జరగాలి. కాని అలా జరగడంలేదు. ఈవెంట్‌వారు ఇష్టానుసారంగా వేదిక ఏర్పాటుతో అక్కడ వసతులు, సాంస్కృతిక కార్యక్రమాలు వారిష్టానుసారం చేశారు. వేదికైతే నేలమట్టంలో ఏర్పాటు చేయడంతో వెనకాల ఉన్న ప్రేక్షకులకు కన్పించడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఈసారి స్టాల్స్‌లో కూడా అంతంతమాత్రంగానే ఏర్పాటు చేశారు. పండుగ సాక్షిగా కోట్ల రూపాయలు కేటాయించినా వసతులు కల్పించకుండా బూడిదపాలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ప్రచారమంతా జిల్లా కేంద్రం తదితర ప్రాంతాల్లో ఆర్భాటంగా చేసి వసతులు కల్పించడంలో వైఫల్యం చెందిందని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఈసారి జిల్లా కలెక్టర్ ఈ పండుగకు రాకపోవడం, ఇక్కడున్న అధికార బృందం ఏర్పాట్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఈవెంట్ వారు ఏదోచేశాములే అన్న చందంగా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం వెనుక ఏమి దాగివుందో అంతుబట్టడం లేదు. ప్రతిసారి పక్షుల పండుగ ప్రారంభానికి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు స్థానిక నేతలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈసారి జిల్లాలో ఉన్న అధికారపార్టీకి చెందినవారే పాల్గొనకపోవడం విశేషం. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికంగా నిధులు కేటాయిస్తున్నా పక్షుల పండుగ నిర్వహణలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పక్షుల పండుగ ప్రారంభానికి నలుగురు మంత్రులు వస్తారని ఆహ్వాన పత్రికల్లో సైతం ముద్రించారు. తీరా కేవలం ఒకేఒక మంత్రిచే పక్షుల పండుగను ప్రారంభించి మమ అనిపించారు. ఇలాంటి రాష్ట్ర పండుగలు నిర్వహించేటప్పుడు జిల్లా అధికార బృందం కూడా సరైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్లు ప్రారంభ పత్రికలు ముద్రించి తీరా దాని ప్రకారం చేయకపోవడం ఏమిటో తెలియలేదు. 16 సంవత్సరాల నుండి జరుగుతున్న పక్షుల పండుగను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించక పోవడం విచారకరం.
రెండోరోజు కానరాని ప్రజాప్రతినిధులు
రెండో రోజు కూడా పక్షుల పండుగలో ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఎవరూ కానరాలేదు. మాములుగానైతే పండుగ ప్రారంభం, మరుసటి రోజు స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు మైదానంలోకి వచ్చి అక్కడ వసతులు, క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించేవారు. అదేవిధంగా అన్ని స్టాల్స్‌ను సందర్శించి పండుగ ఏర్పాట్లపై ఆరా తీసేవారు. ఈసారి ఎవరూ కానరాకపోవడం విశేషం. స్థానికంగా ఉన్న నేత వేనాటి రామచంద్రారెడ్డి మాత్రం పండుగలకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకొన్నారు. ఈ పండుగలో స్థానిక నేతలు కూడా పాల్గొనకుండా నిరుత్సాహంగా కనిపించారు. మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య కానరాకపోవడం విశేషం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వారికి మెమెంటోలు కూడా జేసీ- 2 కమలకుమారి చేతులమీదుగా పంపిణీ చేశారు.