శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతులకు టోల్‌ప్లాజా ఫీజు వసూలు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 21 : ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న రైతులకు టోల్‌ప్లాజా ఫీజు వసూళ్లు చేయవద్దని బీజేవైఎం నాయకులు వినయ్‌నారాయణ, గ్రామ రైతులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం టోల్‌ప్లాజా వద్ద గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజాకు సమీపంలో ఉన్న సుమారు ఆరు గ్రామాల ప్రజలు నిత్యం ఆటోలు, ట్రాక్టర్లు, కార్ల ద్వారా అనేకసార్లు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉండటం వలన టోఫీజు రోడ్డు దాటిన దానికి కూడా వసూలు చేస్తున్నారని, దాంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులతో పాటు స్థానికులు ఈ మార్గం గుండా వాహనాల్లో పయనిస్తున్నారని, అయితే స్థానికుల వద్ద కూడా టోల్‌ప్లాజా నిర్వాహకులు టోల్ వసూళ్లు చేయడం బాధాకరమని ఆయన తెలిపారు. దీనివలన స్థానికంగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాహనదారులకు కనీస వసతులు కల్పించకుండా సర్వీస్ టాక్స్ వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి స్థానికులకు రాయితీలు ఇవ్వడంతోపాటు వాహనదారులకు వౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో రైతులు, ప్రజలతో కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కొండారెడ్డి, సురేష్, సాయి, బాలు తదితరులు పాల్గొన్నారు.

స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల్ని మోసం చేయడం తగదు
* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ఆత్మకూరు, జనవరి 21 : దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాలకు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం పట్టణానికి విచ్చేసిన ఆయన స్థానిక ఓ లాడ్జిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 54 శాతం ఉన్న బీసీ వర్గాలకు జనాభా దామాషాలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మూడు దశాబ్ధాల క్రితం మండల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీం కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టడం సరికాదన్నారు. వ్యక్తి ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలకు విలువలేదన్నారు. కాపు రిజర్వేషన్ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం స్పందించకపోవడం సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గత ఎన్నికల్లో పెద్ద మాదిగనై మేలు చేస్తానని ఇచ్చిన హామీని పక్కనపెట్టి మాట మార్చడం దారుణమన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాదిగల హక్కులను తెరపైకి తెచ్చి లబ్ధి పొందుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. మాదిగల హక్కుల సాధన కోసం ఫిబ్రవరి 19వ తేదీన రాజధాని అమరావతిలో విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సభలో భవిష్యత్ ప్రణాళికను ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపిస్తామని మంద కృష్ణ హెచ్చరించారు. 19న చేపట్టే విశ్వరూప మహాసభను జిల్లాలోని మాదిగలందరూ పెద్దసంఖ్యలో హాజరై ప్రభుత్వాలకు హెచ్చరికలు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొద్దుకూరు మహేష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు అంబేద్కర్ మాదిగ, గొల్లపల్లి శ్రీనివాసులు మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు పొదిలి పుల్లయ్య, నరసయ్య, ప్రభుదాస్, వెంగయ్య, లక్ష్మయ్య, మహిళా నాయకురాలు లక్ష్మమ్మ, ఎం ఎస్ ఎఫ్ యువ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు ఎమ్మార్పీయస్ నాయకులు, దాని ఉప సంఘాల నాయకులు పాల్గొన్నారు.