శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రేపు ఉప రాష్ట్రపతి వెంకటాచలం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఫిబ్రవరి 19 : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనెల 21 నుంచి 23వ తేది వరకు మూడు రోజులపాటు వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నెల్లూరు రానున్నారు. నెల్లూరు నగర పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని గురువారం ఉదయం 11.30 గంటలకు చవటపాళెం పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్ ఆర్‌వీఎన్‌ఎల్ రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైను శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అబ్బిసాహెబ్ కండ్రిగ వద్ద రూ.17.17 కోట్లతో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈకార్యక్రమం పూర్తయిన తరువాత మధ్యాహ్నం 1.30 గంటలకు సరస్వతినగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.50 గంటల వరకు అక్షర విద్యాలయం, స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో ఉండి అనంతరం రాత్రి నెల్లూరు చేరుకుని బస చేస్తారు.
22న రాష్ట్రపతి రాక
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 22వ తేదిన వెంకటాచలం మండలంలో పర్యటిస్తారు. ఉదయం 10.50 గంటలకు చవటపాళెం పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్ వద్దనున్న అక్షర విద్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉదయం 11.15 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్‌కు చేరుకుని ట్రస్ట్‌లో జరగనున్న స్వర్ణ్భారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లోనే బస చేస్తారు. 23వ తేది ఉదయం 9.30 గంటలకు స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక రైలులో రేణిగుంటకు చేరుకుంటారు.
* ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు
వెంకటాచలం మండలంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడుల పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను గత మూడు రోజుల నుంచి శరవేగంగా చేస్తున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, గుంటూరు రేంజ్ ఐజి ఆర్‌కె మీనా, భద్రతా విభాగం డీఐజీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు భారత రాష్టప్రతి, ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత చవటపాళెం పంచాయతీ సరస్వతినగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకుని అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సరస్వతినగర్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఆర్‌విఎన్‌ఎల్ రైల్వే బ్రిడ్జి, దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రం, స్వర్ణ్భారత్ ట్రస్ట్ ప్రాంతాలను పరిశిలించారు. అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మంగళవారం ఉదయం నుంచే జాతీయ రహదారి వెంబడి, వెంకటాచలం రైల్వేస్టేషన్‌లతోపాటు రాష్టప్రతి, ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.