శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతారామపురం, ఫిబ్రవరి 19 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయనున్న నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నెల్లూరు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీశ్రేణులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చిన నాగంపల్లిలో జరిగిన పార్టీ నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మేకపాటి మాట్లాడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే వైకాపాకే సాధ్యవౌతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలు తాత్కాలిక ఊరటనిచ్చేవిగా ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే శాశ్వత పథకాలు అమలు చేస్తారన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు రూ. 15 వేలు, నలభై - డెబ్భై మధ్య వయసు మహిళలకు రూ. 75 వేలు, కులవృత్తులకు ఏడాదికి రూ. 10 వేలు, 45 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఉదయగిరి నియోజకవ్గంలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. గతంలో చంద్రశేఖర్‌రెడ్డి హయాంలోనే నియోజవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గంలో మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే సీతారామపురం మండల పరిధిలో వలసలు నివారించి అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ గెలుపునకు కృషి చేయాలన్నారు. చిననాగంపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చెరుకూరి రమణారెడ్డి వైకాపాలోకి రావడంతో మండలంలో పార్టీ బలపడిందన్నారు. గతంలో తనకు ఈ మండల ప్రజలు రెండు వేల మెజారిటీ ఇచ్చారని రానున్న ఎన్నికల్లో చెరుకూరు, అల్లూరు రాజు, చింతంరెడ్డి సుబ్బారెడ్డిల నాయకత్వంలో 5 వేల మెజారిటీకి తగ్గకుండా కృషి చేయాలన్నారు. పార్టీలో చిన్నపాటి లోపాలుంటే సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పి రమణయ్య, ఎంపిపి జనార్థన్‌రెడ్డి, మాజీ ఎంపిపి ఎన్ అబ్రహాం, మాజీ సర్పంచ్‌లు వెంకటరామిరెడ్డి, దుగ్గయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.