శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి పర్యటనకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 19: దేశ ప్రథమ, ద్వితీయ పౌరులైన రామ్‌నాథ్ కోవింద్, ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనకు సింహపురి సిద్ధమవుతోంది. వారి రాకను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ముమ్మరంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్న రైల్వేలైన్, నెక్లెస్ రోడ్డు పనులను పరిశీలించారు. అలాగే ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ ప్రారంభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. బహిరంగ సభల వద్ద తీసుకోవాల్సిన బందోబస్తులను పరిశీలించారు. మంత్రి నారాయణ కూడా ప్రారంభోత్సవాలు జరుపుకునే ప్రాంతాల్లో పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈనెల 21న జిల్లా కేంద్రంలో వెంకయ్య నాయుడుచే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. వెంకయ్య స్థాపించిన స్వర్ణ్భారత్ ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిధిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగం పనులను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద విజయవాడ డివిజన్‌కు చెందిన అధికారుల బృందం పనులను వేగవంతం చేసింది. రైల్వేస్టేషన్ వేదికగా ఉప రాష్టప్రతి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రైల్వేస్టేషన్ వద్ద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ రస్తోగి పలు సూచనలు చేశారు. రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి వచ్చే మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్ పడమర ముఖద్వారం వద్ద ఉప రాష్టప్రతి బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో సభా వేదికను ప్రత్యేకంగా రూపొందించారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదిక వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతుల రాక సందర్భంగా ఈనెల 20వ తేదీ నుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు చిన్నబజార్ సిఐ ఎస్‌కె అన్వర్ బాషా తెలిపారు. అందులో భాగంగా జొన్నవాడ నుండి ఇరుకళల పరమేశ్వరి ఆలయం మీదుగా నగరంలోకి వచ్చే వాహనాలను పొట్టేపాలెం మీదుగా పుట్టా ఎస్టేట్ నుండి నగరంలోకి మళ్లిస్తున్నట్లు చెప్పారు. బుచ్చిరెడ్డిపాలెం నుండి వచ్చే వాహనాలు యథావిధిగా నగరంలోకి ప్రవేశించవచ్చన్నారు. ఈ మార్పును వాహనదారులు గమనించి నడచుకోవాలని సిఐ కోరారు.