శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతు సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పొదలకూరు మండలం నుండి బుధవారం సంగం ఆనకట్ట మీదుగా వెళ్తున్న ఆయన పెన్నానది వద్ద ఉన్న జలవనరుల శాఖ కార్యాలయం చేరుకుని విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. నగదు జమకాని రైతుల వివరాలు సేకరించి పొరపాట్లను సవరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికలలో టీడీపీ విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

నమ్మకంతో రాజీనామా చేశా.. ఆశీర్వదించండి
* మంత్రి సోమిరెడ్డి
పొదలకూరు, ఫిబ్రవరి 20 : సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలపై తనకు నమ్మకం ఉందని, అందుకే ఎమ్మెల్సీ పదవికి ఇంకా రెండేళ్ల నలభై రోజులు సమయం ఉన్నా రాజీనామా చేశానని, తనను ఆశీర్వదించి అండగా నిలవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. మండలంలోని అయ్యగారిపాలెం, అమ్మవారిపాలెం, నావూరుపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ. 8 వేల కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద 54 లక్షల మందికి తొలివిడతగా రూ. 1000 రూపాయలు వారి ఖాతాల్లోకి బదిలీ చేయడం ప్రారంభించామన్నారు. మరో 3 వేల రూపాయలను త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేలు, కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 8 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తాయని తెలిపారు. 5 ఎకరాల పైబడిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం నిరాకరించిందని, ఐతే రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇవ్వనుందన్నారు. ఎలాంటి లబ్ధి పొందని కౌలు రైతులకు 15 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో రైతన్నలు సంతోషంగా ఉండాలనేదే చంద్రబాబు ముఖ్య ఉద్దేశమన్నారు. దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక్క వాటర్ ప్లాంటు మంజూరైతే దాన్ని మెట్ట ప్రాంతమైన పొదలకూరుకు కేటాయించామని తెలిపారు. రూ.4.60 కోట్లతో చేపట్టిన మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఎక్కడి నుండి పోటీ చేస్తావని తనను సీఎం అడిగారని, తాను మరో మాటకు అవకాశం లేకుండా సర్వేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పానన్నారు. నాలుగున్నరేళ్లుగా తనను, తన కుటుంబబాన్ని శాపనార్థాలు పెడుతూ ఇబ్బంది పెట్టే వ్యక్తులకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పొదలకూరు మండల ఓట్లతో వివిధ పదవులు అనుభవించినవారు ఈ మండలాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అంతకుముందు ఆయన అయ్యగారిపాలెంలో సిమెంటు రోడ్డును ప్రారంభించారు. అమ్మవారిపాలెం, నావూరుపల్లిల్లో సిమెంటు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిపారు. ఓ వికలాంగుడు తనకు పింఛను రావడం లేదని సోమిరెడ్డికి మొర పెట్టుకోవడంతో వెంటనే స్పందించిన సోమిరెడ్డి కొంత నగదును అందజేసి పింఛను అందేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మాజీ జడ్పీటీసీ దేవరం అనూరాధ, మండల టీడీపీ అధ్యక్షులు మోపూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు షేక్ చాంద్‌బాష, పివి రత్నం నాయుడు, షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.