శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఉత్సాహంగా దేహదారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు స్థానిక చెముడుగుంటలోని పోలీస్ శిక్షణ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 800 మంది అభ్యర్థులకు గాను 514 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

23, 24వ తేదీలలో జిల్లాలో
ప్రత్యేక హోదా భరోసా యాత్ర
* డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య వెల్లడి
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 20: జిల్లాలో ఈనెల 23, 24 తేదీలలో ప్రత్యేక హోదా భరోసా యాత్ర నాయుడుపేట నుండి ప్రారంభమవుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు. బుధవారం నగరంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులపాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఈ భరోసా యాత్ర కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలన్నింటిని నెరవేరుస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని ఆయన అన్నారు. 23వ తేదీన నెల్లూరు నగరంలోకి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎఐసిసి జనరల్ సెక్రటరీ ఊమెన్‌చాందీ, ఎఐసిసి కార్యదర్శలు పనబాక లక్ష్మి, పల్లంరాజు, మాజీ ఎంపిలు పాల్గొంటారని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా రాజ్యసభలో ప్రకటించినట్లు తెలిపారు. 5 సంతవ్సరాలు చాలదు 10 సంవత్సరాలు కావాలని అప్పటి ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిందన్నారు. అధికారంలోకి రాకముందు బీజేపీ వారి మేనిఫెస్టోలో పొందుపర్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిందన్నారు. సాక్షాత్తు నరేంద్ర మోదీ రాష్ట్రానికి హోదా ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని చెప్పారు. అయితే హోదా ఇవ్వకుండా 5 కోట్ల ఆంధ్రులను బీజేపీ మోసం చేసిందన్నారు. అటువంటి పార్టీకి దేశంలో ఉన్న ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానిమంత్రిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపై ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, ఉడతా వెంకట్రావు, రఘురామ్ ముదిరాజ్, భవానీ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.