శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి:జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 25: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని సంయుక్త కలెక్టర్-1 వెట్రిసెల్వి కోరారు. సోమవారం తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల మార్పు, పేర్లు మార్పు అంశాలపై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవసరమైనచోట్ల పోలింగ్ కేంద్రాల స్థలాలు మార్పు, పేర్లు మార్పు చేయవలసి ఉందన్నారు. ఈ ప్రకారం నియోజకవర్గాల వారీగా వచ్చిన ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంయుక్త కలెక్టర్ చర్చించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటిని క్రోడీకరించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఆమె ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో ఉచ్చి భువనేశ్వరప్రసాద్ (టీడీపీ), కాళేశ్వరరావు ( బీజేపీ), వి.రమణారెడ్డి, కుమార్ (సీపీఎం), ఎన్నికల తశీల్దార్ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

‘ఓటు హక్కు వజ్రాయుధం’
మనుబోలు, ఫిబ్రవరి 25: ఓటు అనేది వజ్రాయుధం వంటిదని స్థానిక ఇరిగేషన్ ఏఈ ఠాగూర్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని జట్లకొండూరు, కొండూరు సత్రం, కాగితాలపూరు గ్రామాల్లో ఓటర్లకు ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. దీంతోపాటు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటింగ్ యంత్రాల్లో ఓటరు తమకు నచ్చిన వ్యక్తి, పార్టీ గుర్తు పక్కన ఉన్న నీలం బటన్ నొక్కాలన్నారు. బటన్ నొక్కిన వెంటనే తమకు వేసిన అభ్యర్థికే ఓటు వేశామో? లేదో అన్న విషయాన్ని వివి పాట్ల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చే సమయంలో తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వీఆర్‌వోలు సప్తగిరి, బుజ్జయ్య, బీఎల్‌వోలు విజయమ్మ, సుబ్బరామమ్మ తదితరులు ఉన్నారు.