శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 25: జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతికి అంబేద్కర్ సవాసమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సూళ్లూరుపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. 15వ వార్డు సూళ్లూరు నుంచి పుర వీధుల్లో జరిగిన ర్యాలీలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ముత్తుకూరు లక్ష్మమ్మ, పిట్ల చిన్న, వేనాటి చెంగయ్య, పాలా శ్రీకాంత్, రమణయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
25 ఎస్‌పిటి 2. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

రాష్టస్థ్రాయి ఆర్చరీ పోటీలకు గూడూరు క్రీడాకారుడు ఎంపిక
గూడూరు, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల ఆర్చరీ పోటీలకు గూడూరు క్రీడాకారుడు టి జయశంకర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అర్జున ఆర్చరీ అకాడమీ సీనియర్ క్రీడాకారుడైన టి జయశంకర్‌ను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ సోమవారం అభినందించారు. ఈనెల 24న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నెల్లూరు ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కాంపౌండ్ రౌండ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే రాష్ట్ర పోటీలకు జయశంకర్ ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారుడిని, కోచ్ శివశంకర్‌ను లయన్స్‌క్లబ్ పీఆర్వో కడివేటి చంద్రశేఖర్, జివి సుబ్బారావు, పాణి, రమేష్ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ రాష్టస్థ్రాయి ఆర్చరీ పోటీలకు గూడూరు పట్టణం నుంచి సీనియర్ క్రీడాకారుడు జయశంకర్ ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయనను ఎమ్మెల్యే సన్మానించారు.

‘నెల్లూరు నగర జనసేన టికెట్ ముస్లింలకు కేటాయించాలి’
గూడూరు, ఫిబ్రవరి 25: జిల్లా కేంద్రమైన నెల్లూరులో మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నందున నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మైనార్టీలకు కేటాయించాలని జనసేన గూడూరు పట్టణానికి చెందిన సయ్యద్ నయూం సోమవారం స్క్రీనింగ్ కమిటీని కలిసి వినతిపత్రం అందచేశారు. జిల్లా కేంద్రంలో అధికశాతం ఓటర్లు పవన్‌కళ్యాణ్ అభిమానులు, మైనార్టీలు ఉన్నారని ఈక్రమంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మైనార్టీలను ఎంపిక చేయాలని ఆయన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరానికి విన్నవించారు. ఈ సందర్భంగా గంగాధరం మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఓటర్లలో మెజారిటీ భాగం మైనార్టీలు ఉన్నారని ఈ అంశాన్ని కచ్చితంగా పవన్‌కళ్యాణ్ దగ్గర చర్చించి మైనార్టీలకు అవకాశం ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నయూం తెలిపారు.