శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగరంలో రాత్రి పదిన్నరకు దుకాణాలు బంద్ చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 9: నగరంలో రాత్రి పదిన్నర తర్వాత మద్యం, ఇతర అన్ని రకాల దుకాణాలు, హోటళ్లను మూసివేయించాలని నగర పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తన ఛాంబర్‌లో జరిగిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం అనంతరం ఆయన విలేఖరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అసాంఘిక, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా నిఘాను పటిష్టపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నగరంలోని వ్యాపారులు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో కొందరు యువత, విద్యార్థులు ఎక్కువ సిసి సామర్థ్యం కలిగిన మోటార్‌బైక్‌లపై, సైలెన్సర్ లేకుండా మితిమీరి డ్రైవింగ్ చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ స్టాపర్స్ దగ్గర పికెట్ చేస్తున్న పోలీస్ సిబ్బందితో తరచూ గొడవలకు దిగుతున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వాహన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయడం, పత్రాలు అడిగినపుడు వాగ్వివాదాలకు దిగడం నగరంలో పరిపాటిగా మారిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. రంజాన్ మాస ఉపవాసదీక్షలు జరుగుతున్నందున మసీదుల వద్ద భోజనాలు పంపిణీ చేసేవారు రాత్రిపూట తమ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని, అటువంటి వారికి రంజాన్ నెల పూర్తయ్యే వరకూ పై నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతక్రితం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో వచ్చిన పలు ఫిర్యాదులపై ఆయన సంబంధిత అధికారులకు చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, అదనపు ఎస్పీ (ఎఆర్), సూరిబాబు, డిఎస్పీలు కోటారెడ్డి, శ్రీనివాసాచారి, ఏఆర్ డిఎస్పీ చెంచురెడ్డి, ఎస్బీ ఇన్స్‌పెక్టర్ మాణిక్యరావు, ఎస్సై శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.