శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రెండు బైక్‌లు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేజర్ల, జూన్ 10: మండలంలోని నూతక్కివారి కండ్రిక వద్ద శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గాలిపాళెం గ్రామానికి చెందిన జి మహేంద్ర (22), కె శ్రీను (21) ఆర్‌వైపాళెంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చొన్న మహేంద్ర కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కె శ్రీనును 108లో పొదలకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చేజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.