శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జూన్ 13: నెల్లూరులో సోమవారం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది. కిడ్నాప్‌కు గురైన ఆ విద్యార్థిని దుండగుల బారి నుండి తప్పించుకుని వెంకటాచలం పరిధిలోని స్వర్ణ టోల్‌ప్లాజాకు చేరుకుంది. నెల్లూరులో తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి అపహరించుకుని వెళ్తుండగా వెంకటాచలం స్వర్ణ టోల్‌ప్లాజా దాటిన తరువాత తప్పించుకున్నట్లు ఆ విద్యార్థిని చెబుతోంది. పోలీసులకు ఆ విద్యార్థిని చెప్పిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని కరటంపాడు గ్రామానికి చెందిన మస్తాన్ కుమారై మోనాజ్ (17) నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్‌లో ఉంటున్న నానమ్మ ఇంటి వద్ద ఉంటూ సమీపంలోని విశ్వసాయి ఇంటర్ కళాశాలలో బైపిసి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో నడిచి కళాశాలకు వెళ్తుండగా ఆర్కే మార్బుల్స్ దుకాణం వద్దకు రాగానే గుర్తుతెలియని అగంతకులు కారులో తనను బలవంతంగా ఎక్కించుకుని మత్తుమందు ఇచ్చినట్లు తెలిపింది. వెంకటాచలంలోని స్వర్ణటోల్ ప్లాజా దాటగానే ఎవిఎస్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లే మార్గంలో కారు నిలిపి అగంతకులు మద్యం సేవిస్తుండగా తనకు మత్తు తగ్గడంతో అక్కడి నుండి తప్పించుకుని వచ్చినట్లు చెప్పింది. మోనాజ్ ఏవిఎస్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లే రోడ్డు నుంచి టోల్‌ప్లాజా దాక పరిగెత్తుకుంటు వచ్చి పడిపోయింది. ఈ విషయాన్ని టోల్‌ప్లాజా సిబ్బంది జహీర్ బాషా, పక్కనే వున్న స్వాతి బి పార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు గుర్తించారు. దీంతో మోనాజ్‌ను ప్లాజా కార్యాలయంలో కూర్చోబెట్టి వెంకటాచలం పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారని, ఆ సమయంలో కారులో ఏడుగురు యువకులు ఉన్నట్లు చెప్పింది. వారు స్థానికులు కాదని, మరాఠీ భాషలో మాట్లాడుతున్నట్లు చెప్పింది. ఆ కారులో తనతోపాటు మరో ఇద్దరు యువతులను కూడా కిడ్నాప్ చేశారని, వారికి మత్తుమందు ఇచ్చి కాళ్లు కట్టేసి పడుకోబెట్టారని వివరించింది. టోల్‌ప్లాజా దాటిన తరువాత తనకు మత్తు వీడటంతో తప్పించుకున్నట్లు పేర్కొంది. ప్లాజా సిబ్బంది బాలిక తండ్రికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసులురెడ్డి, వెంకటాచలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు హుటాహుటిన ప్లాజా వద్దకు చేరుకుని బాలికను విచారించారు. కిడ్నాప్ చేసిన తీరు, అగంతకుల నుండి బాలిక తప్పించుకున్న తీరుపై ఆరా తీశారు. ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు కిడ్నాప్ జరిగిన ఘటన నెల్లూరు 5వ నగర పోలీసుస్టేషన్ పరిథిలోకి రావటంతో ఆ ప్రాంతంలో కిడ్నాప్ జరగటంతో అక్కడకు కేసు బదలాయించారు. అయితే పోలీసులు కిడ్నాప్ జరిగిన సమయానికి ముందు టోల్‌ప్లాజా మీదుగా వెళ్లిన వాహనాల వివరాలు ఆరా తీస్తున్నారు.